ఓన‌ర్‌ను కాపీ కొడుతున్న కుక్క‌.. వీడియో చూస్తే న‌వ్వులే

The Dog Who Is Copying The Owner If You Watch The Video You Will Laugh

ఒక‌ప్పుడు కంటే ఇప్పుడు మ‌నుషుల‌తో పాటు కుక్క‌లు కూడా చాలా తెలివి మీరి పోతున్నాయండోయ్‌.అవి కూడా మ‌నుషుల‌ను చూసి అనేక విష‌యాల‌ను తెలుసుకుంటున్నాయి.

 The Dog Who Is Copying The Owner If You Watch The Video You Will Laugh-TeluguStop.com

కోపం, బాధ‌, న‌వ్వు, మాట‌లు అర్థం చేసుకోవ‌డం ఇలా అన్నింటిలోనూ మ‌నుషుల‌ను ఫాలో అయిపోతున్నాయి.అయితే ఇలా పెంపుడు కుక్క‌లుకు స‌బంధించి ఏదో ఒక వీడియో అయితే నిత్యం వైర‌ల్ అవుతూనే ఉంది.

చాలా వ‌ర‌కు ఇవి ఫ‌న్నీగానే ఉంటున్నాయి.కుక్క‌లు య‌జ‌మానులు ఇంటికి లేటుగా వ‌స్తే ఏడుస్తూ తిన‌కుండా కూర్చోవ‌డం కూడా మ‌నం అప్పుడ‌ప్పుడు చూస్తున్నాం.

 The Dog Who Is Copying The Owner If You Watch The Video You Will Laugh-ఓన‌ర్‌ను కాపీ కొడుతున్న కుక్క‌.. వీడియో చూస్తే న‌వ్వులే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక త‌మ ఓన‌ర్ల‌కు ఏదైనా ఆప‌ద వ‌చ్చింద‌టే చాలా చాలా కుక్కలు త‌మ ప్రాణాల‌ను అడ్డుగా వేసి మ‌రీ కాపాడుతున్నాయి.కానీ ఇప్పుడు ట్రెండ్ కు త‌గ్గ‌ట్టు కుక్క‌లు కూడా ఫిట్ నెస్ లాంటి వాటి మీద దృష్టి పెడుతున్నాయి.

ఏం మాకేం త‌క్కువ మేము చేయొద్దా.మేము ఫిట్ గా ఉండొద్దా అన్న‌ట్టు అవి కూడా ఇలాగే చేస్తున్నాయి.

అయితే కొన్ని కుక్క‌లు త‌మ య‌జ‌మానుల‌తో క‌లిసి మార్నింగ్ టైమ్ లో లేదంటే ఈవినింగ్ టైమ్ వ్యాయామాలు చేసేందుకు వెళ్తుండ‌టంతో అవికూడా ఓన‌ర్లు చేసిన‌ట్టే చేస్తున్నాయి.ఇప్పుడు కూడా ఓ కుక్క ఇలాంటి పనే చేస్తోంది.

వైర‌ల్ వీడియోలో మ‌నం చూస్తే ఓ కుక్క త‌న ఓన‌ర్ తో క‌లిసి వ్యాయామాలు చేసేందుకు వెళ్తుంది.అయితే ఓన‌ర్ ముందు ఉండి ఎక్సైర్‌సైజ్ చేస్తుంటే… అతిని వెన‌కాలే ఉన్న ఓకుక్క కూడా అత‌న్ని ఫాలో అయిపోవ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.అత‌న్ని కాపీ కొడుతూ అత‌ను లేస్తే లేవ‌డం కూర్చుంటే కూర్చోవ‌డం ఇందులో మ‌న‌కు క‌నిపిస్తుంది.అయితే ఈ మొత్తం వీడియో చూస్తే ఫుల్ ఫ‌న్నీగా ఉంది.కుక్క వ్యాయామాలు చూస్తే మాత్రం ఎవ‌రైనా స‌రే ప‌డి ప‌డి న‌వ్వుకోవాల్సిందే.దీని మీద చాలా ఫ‌న్నీ కామెంట్లు, మీమ్స్ పేలుతున్నాయి.

#Dog #Memes #Dog #Dog #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube