వైర‌ల్‌.. బేస్‌బాల్ మ్యాచ్‌లోకి స‌డెన్ ఎంట్రీ ఇచ్చిన కుక్క‌..

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఓ త‌ర‌హా వీడియోలు బాగా పాపుల‌ర్ అవుతున్నాయి.అదేనండి ఏదైనా మ్యాచ్ మ‌ధ్య‌లో పెంపుడు జంతువులు ఎంట‌ర్ అయి నానా బీభ‌త్సం చేసేస్తున్నాయి.

 The Dog Who Gave A Sudden Entry Into A Baseball Match-TeluguStop.com

దీంతో అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆగిపోతున్నాయి.దేశాల మ‌ధ్య‌లో జ‌రుగుతున్న మ్యాచ్‌ను ఆపేయాలంటే చాలా ధైర్యం కావాలి.

కానీ ఇవి మాత్రం ఎలాంటి భ‌యం లేకుండానే ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి.ఇక ఇప్పుడు కూడా ఇలాగే బేస్ బాల్ మ్యాచ్ అత్ంయ‌త ఉత్కంఠభరితంగా సాగుత‌న్న క్ర‌మంలో అనుకోని అతిథి గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది.

 The Dog Who Gave A Sudden Entry Into A Baseball Match-వైర‌ల్‌.. బేస్‌బాల్ మ్యాచ్‌లోకి స‌డెన్ ఎంట్రీ ఇచ్చిన కుక్క‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంకేముంది దాని దెబ్బ‌కు ఆ మ్యాచ్ అక్క‌డితోనే ఆగిపోయింది.అయితే ఇంత సీరియ‌స్ మ్యాచ్‌లోకి ఎలాంటి భ‌యం లేకుండా ఓ పెంపుడు కుక్క ఎంటర్ అయ్యింది.దీంతో అంద‌రూ షాక్ అయిపోయారు.ఇక ఆ కుక్క ప్లేయ‌ర్లు ప‌ట్టుకునే బ్యాట్‌ను నోట కరుచుకుని ప‌రిగెత్తింది.

కొంచెం సేపు గ్రౌండ్‌లోనే ఉండి నానా హంగామా చేసింది.దాని దెబ్బ‌కు ప్లేయ‌ర్లు సైలెంట్ అయిపోయారు.

అది గ్రౌండ్‌లో త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్టు అటూ ఇటూ తిరుగుతూ కాసేపు మ్యాచ్ ను ఆపేసింది.ఇక బాల్‌ను కొట్టేందుకు చాలా సీరియ‌స్‌గా చూస్తున్న‌ వారు కూడా ఆగిపోయారు.

ఇదంతా వీడియోలో షూట్ అయింది.ఇంకేముంది మామూలుగానే జంతువుల వీడియోలు అంటే బాగా పాపుల‌ర్ అయిపోతాయి.మ‌రి కుక్క‌కు సంబంధించిన వీడియో కాకుండా ఉంటుందా.

అన్ని వీడియోల్లాగే ఇది కూడా గంట‌ల్లోనే ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది.ఈ ఇంట్రెస్టింగ్ వీడియోను మైనర్ లీగ్ బేస్‌బాల్ అనే ట్విట్ట‌ర్ కాతాలో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారిపోయింది.

కాగా ఆ పెంపుడు కుక్క‌ను అస‌లు గ్రౌండ్ లోకి ఎవ‌రు రానిచ్చారంటే అందులోని ఓ జట్టుకు ఆకుక్క పిల్ల బ్యాట్ డాగ్‌గా విధులు నిర్వ‌హిస్తోందండి.

#Baseball Match #Bassball #Virai #Virai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు