బతికి ఉన్న రోగిని చ‌నిపోయాడ‌ని చెప్పిన డాక్ట‌ర్లు.. అంత్య‌క్రియ‌లు చేస్తుండ‌గా..

రోజురోజుకూ వైద్యం మరింత కాస్ట్లీ అవుతుండటం మనం చూడొచ్చు.ఇక ఏదైనా జబ్బు సోకిందని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

 Doctors Say A Surviving Patient Is Dead While Performing A Funeral, Doctors, Pat-TeluguStop.com

అలా ఆస్తులు అమ్ముకున్నా ప్రాణాలు కాపాడుతురాన్న నమ్మకం కూడా లేదు.తాజాగా అటువంటి ఘటన ఒకటి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో బతికున్న పేషెంట్‌ను చనిపోయాడని తెలిపారు.దాంతో రోగి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతూ విలపించి బంధువులకు సమాచారం ఇచ్చారు.

ఇక పేషెంట్ వద్దకు వెళ్లి చూసి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పేషెంట్ శ్వాస తీసుకోవడం చూసి షాక్ అయ్యారు.ఈ నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు.

ఈ ఘటన సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది.వివరాల్లోకెళితే.

సనత్‌నగర్‌కు చెందిన మహేందర్‌ అనే వ్యక్తి కొద్దిరోజుల నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు.ట్రీట్‌మెంట్ నిమిత్తం సదరు వ్యక్తి కుటుంబీకులు అతడిని తొలుత ఈసీఐఎల్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

కానీ, అక్కడ ఆస్పత్రి వారు అడ్మిట్ చేసుకోలేదు.దాంతో వారు సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు చికిత్స స్టార్ట్ చేశారు.

పేషెంట్‌ను వెంటిలేటర్‌పై ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.పేషెంట్ కుటుంబీకుల నుంచి ట్రీట్‌మెంట్ కోసం రూ.3.5 లక్షలు తీసుకున్నారు.ఈ నేపథ్యంలోనే అంతా బానే ఉంది రోగి మహేందర్ కోలుకుంటున్నాడని అతడి కుటుంబీకులు అనుకుంటున్నారు.

Telugu Doctors, Ecil Private, Hyderabad, Pateint Strike, Mahender, Private-Lates

అంతలోనే ఆస్పత్రి సిబ్బంది మహేందర్‌ మరణించాడని చెప్పి వెంటిలేటర్‌ తొలగించి బయటకు తీసుకువచ్చారు.విషయం తెలుసుకుని మహేందర్ కుటుంబీకులు విలపిస్తూ బంధువులకు సమాచారమిచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే మహేందర్‌ను బయటకు తీసుకురాగా అతడు శ్వాస తీసుకోవడాన్ని కుటుంబీకులు గమనించారు.

వెంటనే పల్స్ చెక్ చేశారు.పల్స్‌ ఆక్సీమీటర్‌ ద్వారా పల్స్‌ చెక్‌ చేయగా 95 చూపించింది.

దాంతో మహేందర్ కుటుంబీకులు బతికున్న వ్యక్తిని చనిపోయాడని చెప్పిన ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రైవేటు ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు.ధర్నా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడారు.

వారిని సముదాయించారు.రోగి మహేందర్‌ను తిరిగి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ నిమిత్తం జాయిన్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube