వైద్యుడి నిర్వాకం.. ఏకంగా ఆపరేషన్ గదిలోనే..?

ఆపరేషన్ గది అంటే ఎంతో శుభ్రంగా ఉండాలి.లేకపోతే పేషెంట్లకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది.

 The Doctor Who Turned The Operation Room Into A Kitchen,doctor,operation Room,ki-TeluguStop.com

కానీ ఇక్కడ మాత్రం ఆపరేషన్ గది.అనధికారిక కార్యకలాపాలకు వేదికగా మారింది.ఏకంగా ఆపరేషన్ గదిని వంటగది గా మార్చుకున్నాడు అక్కడి వైద్యులు.ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం లో ఈ ఘటన చోటు చేసుకుంది.పెద్దారవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాలుగు గదులున్నాయి.

ఇక్కడ వైద్యుడిగా వెంకటేశ్వరరావు పని చేస్తున్నాడు.

అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గదులను సొంత అవసరాల కోసం ఉపయోగించుకోవద్దు అని నిబంధన ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి అక్కడి వైద్యులు వెంకటేశ్వరరావు ఏకంగా ఆపరేషన్ గదిని వంటగది గా మార్చుకున్నాడు.ఇదేంటని ప్రశ్నిస్తే ఏకంగా సిబ్బంది పైనే బెదిరింపులకు దిగాడు.

అంతేకాదు వైద్యుడితో చేతులు కలిపిపిన అక్కడి హెల్త్ సూపర్వైజర్ కూడా దీనికి సహకరిస్తున్నట్లు సిబ్బంది చర్చించుకుంటున్నారు.

రోజురోజుకు ఆ డాక్టర్ తీరు చూసి సిబ్బంది సైతం షాక్ అవుతున్నారు.

ఇక ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో… వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండేందుకు ఎవరికీ అనుమతులు లేవు అంటూ స్పష్టం చేశారు.ఆపరేషన్ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని ఇష్టం వచ్చినట్లు వాడకూడదు అంటూ తెలిపారు.

వైద్యశాలలో నివాసం ఉండేందుకు ఎవరికీ అనుమతి లేదని తెలిపిన ఉన్నతాధికారులు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube