వైద్యుడి ఘాతుకం.. కట్టుకున్న భార్యను కిరాతకంగా.. ?

కుటుంబ కలహాల విషయంలో చదువుకున్న వారు, చదువులేని వారు ఒకేలా ఆలోచిస్తున్నారు.ఏదైనా సమస్య ఎదురైతే చంపడమో, చావడమో పరిష్కారం అని భావిస్తున్నారు.

 The Doctor Gokul Kumar Killed His Wife Keerthana-TeluguStop.com

ఈ క్రమంలో ఎందరో తమ భవిష్యత్తును అంధాకారంలోకి నెట్టుకుంటున్నారు.ఇకపోతే ఉన్నత విద్యావంతుడైన ఒక వైద్యుడిని అతని భార్య విడాకులు కోరిందని అతి కిరాతకంగా చంపాడు.

ఆ వివరాలు తెలుసుకుంటే.

 The Doctor Gokul Kumar Killed His Wife Keerthana-వైద్యుడి ఘాతుకం.. కట్టుకున్న భార్యను కిరాతకంగా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమిళనాడు, కోయంబత్తూరుకు చెందిన గోకుల్‌ కుమార్‌(40) అనే వైద్యుడు కీర్తన అనే మహిళను వివాహం చేసుకుని ఇల్లరికం అల్లుడిగా ఉంటున్నాడట.

కాగా వారి మధ్య తలెత్తిన అభిప్రాయభేదాల వల్ల విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.

ఈ క్రమంలో కోర్టును కూడా ఆశ్రయించారు.అయితే శుక్రవారం కీర్తన ఇంటికి వెళ్లిన గోకుల్‌ కత్తితో తన మామ మురహరిపై దాడి చేశాడు.కీర్తనను విచక్షణారహితంగా పొడిచి, కారుతో తొక్కించి చంపేశాడట.

అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.అయితే ఈ హడావుడిలో టోల్‌ గేటు వద్ద కారు బోల్తాపడడం తో గాయపడిన గోకుల్ చెంగల్పట్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడట.

ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తూ ప్రారంభించారట.

#Social Media #Doctor Killed #Tamil Nadu #Wife #GokulKumarm

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు