Alok Modi Palasia : నిద్ర చెడుగొడుతున్న పక్కింటోళ్ల కోడి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన డాక్టర్

కొన్ని సార్లు పోలీసులకు వచ్చే ఫిర్యాదులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.వాటిపై ఎలా స్పందించాలో తెలియక పోలీసులు సైతం బుర్ర గోక్కుంటారు.

 The Doctor Complained To The Police About The Chicken Next Door Who Was Having T-TeluguStop.com

ఇదెక్కడి ఫిర్యాదు అంటూ చాలా మంది ఆశ్చర్యపోతుంటారు.అలాంటి ఘటన ఇండోర్‌లో జరిగింది.

ఓ డాక్టర్ తన పక్కింటోళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పక్కింటోళ్ల కోడి రోజూ ఉదయాన్నే కూస్తోందని, తన నిద్ర పోగొడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఈ ఫిర్యాదు చూసిన పోలీసులు అవాక్కయ్యారు.అయితే డాక్టర్ పడుతున్న బాధను తెలుసుకుని పరిస్థితిని అర్థం చేసుకున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇండోర్ పోలీసులకు ఓ డాక్టర్ వింత ఫిర్యాదు చేశాడు.

గ్రేటర్ కైలాష్ హాస్పిటల్ సమీపంలో డాక్టర్ అలోక్ మోడీ పలాసియా అనే వ్యక్తి నివసిస్తున్నారు.ఆయన ఆసుపత్రిలో వైద్యునిగా సేవలందిస్తూ చాలా లేటుగా ఇంటికి చేరుకుంటుంటాడు.

దాదాపు అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తుంటాడు.తీరా నిద్రపోగానే తెల్లవారు జామునే పక్కింటోళ్ల కోడి గట్టిగా కూత పెడుతోంది.

దీంతో ప్రశాంతంగా పడుకుందామని భావిస్తే కోడి కారణంగా నిద్రాభంగం కలుగుతోంది.చాలా కాలం ఓపిక పట్టి, చివరికి పక్కింటి మహిళతో మాట్లాడాడు.

ఆ కోడిని బోనులో పెట్టాలని, అది బయటకు వచ్చి కూస్తుంటే తన నిద్ర పోతోందని అన్నాడు.తనతో పాటు ఇరుగుపొరుగు వారికి కూడా కోడి వల్ల ఇబ్బంది కలుగుతోందని ఆమె దృష్టికి తీసుకెళ్లాడు.

అయితే ఆమె పట్టించుకోలేదు.దీంతో ఆయన చివరికి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పక్కింటి మహిళ తీరుపై ఫిర్యాదు చేశాడు.

ఈ విషయాన్ని ఎలా పరిష్కరించాలనే సందిగ్ధంలో పోలీసులు పడిపోయారు.మహిళపై డాక్టర్ అలోక్ మోదీ ఫిర్యాదు చేసిన విషయాన్ని పలాసియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంజయ్ సింగ్ బేస్ ధృవీకరించారు.

ఇరువర్గాలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపిస్తానని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube