కారు చిచ్చు నుంచీ కరోనాలోకి....హైదరాబాద్ ఎన్నారై వ్యధ...!!!!  

The Doctor Akash Raj Saxena Australia Corona Effect -

పెనం మీద నుంచీ పొయ్యిలో పడటం అంటే ఇదేనేమో…ఆస్ట్రేలియా లో జరిగిన కారుచిచ్చు అందరికి గుర్తు ఉండేఉంటుంది.కోట్లాది జీవాలు, కొన్ని లక్షల హెక్టార్ల అడవి దహించుకుపోయాయి.

 The Doctor Akash Raj Saxena Australia Corona Effect - -Telugu NRI-Telugu Tollywood Photo Image

అంతేకాదు ఎంతో మంది ఇళ్ళు ఆ కారు చిచ్చులో అంటుకుపోయి పూర్తిగా బూడిద అయ్యిపోయాయి.ఎంతో మంది ఆస్ట్రేలియా ప్రజలు వీధిన పడ్డారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ కి చెందిన ఓ ఎన్నారై కుటుంభం కూడా ఈ కారు చిచ్చులో చిక్కుకుంది.తమ ఇల్లు పూర్తిగా బూడిద కావడంతో తమ సొంత ప్రాంతమైన హైదరాబాద్ వెళ్ళాలని అనుకున్నారు…ఇప్పుడు ఈ ఎన్నారై కుటుంభానికి కరోనా కష్టాలు తోడయ్యాయి.
అసలే కారుచిచ్చు మిగిల్చిన విషాదం వదలక ముందే కరోనా భయం మరింతగా ఆ కుటుంభాన్ని విషాదంలో నింపింది.వివరాలలోకి వెళ్తే.హైదరాబాద్ కి చెందిన ఆకాస్ రాజ్ ఆస్ట్రేలియా లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు.న్యూ సౌత్ వెల్ లో ఉన్న అతడి ఇల్లు కారు చిచ్చులో కాలిపోయింది.సర్వం పోగొట్టుకున్న అతడు ఏప్రియల్ 4 న హైదరాబాద్ రావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు.అయితే…

కారు చిచ్చు నుంచీ కరోనాలోకి….హైదరాబాద్ ఎన్నారై వ్యధ… - The Doctor Akash Raj Saxena Australia Corona Effect - -Telugu NRI-Telugu Tollywood Photo Image

కరోనా ఎఫ్ఫెక్ట్ తో భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలపై నిషేధాజ్ఞలు విధించడంతో వారి ప్రయాణం కాస్తా రద్దు అయ్యింది.దాంతో అతడి దీన పరిస్థితిని తెలిపాడు.తన సోదరుడికి ఆరోగ్యం బాలేదని, తన తండ్రికి వయసు మీద పడిందని, ఈ పరిస్థితిని వివరించడానికి ఆస్ట్రేలియాలో ఇండియన్ హై కమిషన్ ని ఆశ్రయిస్తే అక్కడి అధికారులు అందుబాటులో లేరని తెలిపారు.

తమ కుటుంభ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు తమని హైదరాబాద్ పంపాలని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాడు.అయితే ప్రస్తుతం కరోనా ఇండియాలో విపరీతంగా విస్తరించే అవకాశం ఉన్న నేపధ్యంలో అతడి వినతిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

తాజా వార్తలు

The Doctor Akash Raj Saxena Australia Corona Effect Related Telugu News,Photos/Pics,Images..