రజినీకాంత్‌ని ఛీ కొట్టిన డైరెక్టర్ తేజ.. అసలు నిజం తెలిస్తే తట్టుకోలేరు!

కమెడియన్ సుమన్ శెట్టి ఒకసారి ఒక దర్శకుని దగ్గరికి వెళ్ళి .సర్, ఈరోజు నేను ఈ స్థితికి వచ్చానంటే కారణం మీరే ఒక ఇల్లు కూడా కట్టుకుంటున్నానని అన్నారు.

 The Director Teja Who Slammed Rajinikanth-TeluguStop.com

అప్పుడు ఆ డైరెక్టర్ మాట్లాడుతూ.సరే మంచి విషయం.

అయితే ఇల్లు కడుతున్నావు కదా.అందులో నాకొక గది సెపరేట్ గా ఏర్పాటు చేయి.నాక్కూడా ఇల్లు ఉన్నప్పటికీ నేను ఎప్పుడు రోడ్డున పడతానో తెలీదు.నేను విభిన్న సినిమాలు తీస్తుంటాను.అవి హిట్ అవుతాయో, ప్లాప్ అవుతాయో తెలీదు.కాబట్టి సడెన్ గా నేను రోడ్డున పడ్తే.

 The Director Teja Who Slammed Rajinikanth-రజినీకాంత్‌ని ఛీ కొట్టిన డైరెక్టర్ తేజ.. అసలు నిజం తెలిస్తే తట్టుకోలేరు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్కడా, ఇక్కడా అని కాకుండా .మీ ఇంటికే వస్తాను.అప్పుడు నా కోసం ఉంచిన ఆ గదిలో నేను,నా ఫ్యామిలీ ఉంటామని చెప్పారు.దాంతో ఆశ్చర్యపోయిన సుమన్ శెట్టి ఆనందంతో ఆయనకు ఆ అవకాశం ఇచ్చినందుకు మురిపోయాడు.

విశేషమేమిటంటే.ఇప్పటికీ ఆ ఇల్లు ఖాళీగానే ఉంది.

ఇంతకీ అంత గొప్ప డైరెక్టర్ ఎవరా అని అనుకుంటున్నారా ? చిత్రం సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు తేజ.

ఇకపోతే తేజ గురించి ఏం చెప్పాలన్నా అవి వివాదా స్పదంగానే ఉంటాయి.

ఎందుకు అంటే ఆయన వచ్చింది రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి.అని చాలా మంది చెప్తుంటారు.

కానీ, నిజానిజాలేంటో ఆయనతో మాట్లాడినపుడు మాత్రమే తెలుస్తూ ఉంటాయి.

ఉదాహరణకి తీసుకుంటే.

నువ్వు నేను మూవీకి సంబంధించి షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సీన్ లో నటి అనిత ఏడవాల్సి ఉంటుంది.ఎన్ని టేకులు తీసుకున్నా… అనుకున్నా ఎక్స్ప్రెషన్ రాలేదు.

ఆ సమయంలో తేజ, అనితతో నేను నీ చెంపపై కొడతాను.అప్పుడు కన్నీళ్లు వస్తాయని అన్నారట.

ఆమె కూడా ఓకే చెప్పడంతో.తేజ అనితను చెంపపై కొట్టారంట.

Telugu Baba Movie, Climax Scene, Director Teja, Director Teja And Rajnikanth Issue, Heroine Anitha, Nuvvu Nenu Movie, Rajinikanth, Suman Shetty, Super Star Rajnikanth, Tollywood-Movie

వెంటనే ఆ సీన్ అనుకున్నా విధంగా ఆ షాట్ వచ్చిందంట.ఇది అస్సలు జరిగిన విషయం.కానీ అందరూ ఈ విషయాన్ని అప్పట్లో ఒక సంచలనం చేశారు.సరిగ్గా నటించలేదని తేజ ఆ అమ్మాయిని కొట్టాడని పలు పత్రికల్లో రాశారు.కానీ అక్కడ ఆ అమ్మాయికి చెప్పే కొట్టాడన్న విషయం మాత్రం కొందరికే తెలుసు.ఏదేమైనా ఆ విధంగా వచ్చిన వివాదం.

ఆ సినిమా బిగ్ హిట్ కావడానికి కూడా ఒక కారణం అయింది.

ఒకసారి తేజ, సూపర్ స్టార్ రజనీ కాంత్ కు కథ చెప్పారట.

ఆయన అంత విని .ఒకే బాగుంది.కానీ, క్లైమాక్స్ ఇలా కాదు వేరేలా చేస్తే బాగుంటుందని చెప్పారట.అది తేజకి నచ్చక.“నువ్వెంటీ నేను కథ తయారు చేస్తే క్లైమాక్స్ మార్చమంటావు.నువ్వెంత పెద్ద హీరో అయినా ఓకే.కానీ క్లైమాక్స్ మార్చమని చెప్పే అధికారం మాత్రం నీకు లేదు” అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయారట తేజ.మామూలుగా అయితే అలాంటి హీరో చేస్తానని ఒప్పుకోవటమే గొప్ప.అలాంటిది ఇలా ఎదురు ఎవరూ చెప్పరు.కానీ తేజ అవేవీ లెక్క చేయకుండా తన దార్లో తాను వెళ్ళిపోయారు.ఏమైనా అంటే.హీరో నిజంగా అంతా తెలివైన వాడు, మార్పులు చేర్పులు చేయాలి అంటే అతను తీసిన బాబా లాంటి సినిమా ఎందుకు అంత ప్లాప్ అవుతుందని ప్రశ్నిస్తారు తేజ.అలా అనుకుంటే దానికి రజనీకాంత్ బాధ్యుడే కదా అని ఆయన అంటారు.

Telugu Baba Movie, Climax Scene, Director Teja, Director Teja And Rajnikanth Issue, Heroine Anitha, Nuvvu Nenu Movie, Rajinikanth, Suman Shetty, Super Star Rajnikanth, Tollywood-Movie

డైరెక్టర్ అనే వాడు తనకు సంతృప్తి కరంగా అనిపించాకే ఎవరికైనా కదా చెప్తాడు.వీళ్ళు ఒక అరగంట విని ఇలా చేయండి, అలా చేయండి అంటే.వాళ్లకు ఎలా అనిపిస్తుందో మాత్రం ఆలోచించరు.

ఎందుకంటే వాళ్ళు హీరోలు కాబట్టి, వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది.కాబట్టి భయపడి అలా కథను మార్చి తీస్తారు.

అలాంటి డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు.కానీ నేను ఆ కోవలోకి రాను.

నేనెలా అనుకుంటానో ఆ ధోరణిలోనే సినిమాను తీస్తానని కరాఖండిగా చెప్పేస్తారు తేజ.

ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు కథను మార్చి తీస్తే డైరెక్టర్ అనుకున్న విధంగా సినిమాను ఎలా తీయగలడు.చిన్న హీరోలైనా, పెద్ద హీరోలైనా డైరెక్టర్ చెప్పింది వినాలి.అలా వినని హీరోలు నాకు వద్దు.నేను ఎవరి మాట వినను అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు తేజ.

#Anitha #Baba #Suman Shetty #Nuvvu Nenu #Climax

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు