సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఇండస్ట్రీలో అగ్ర హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు అంటే కెరియర్ మొదట్లో వారు కూడా ఎన్నో కష్టాలను ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో ఆ స్థాయికి వచ్చి ఉంటారు.ఇలా తాము కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డామని పలువురు స్టార్ సెలబ్రిటీలు పలు సందర్భాలలో తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు నాని( Nani ) కూడా ఇలాంటి అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొన్నారని తాజాగా తెలియజేశారు.

నాని హీరోగా నటించిన దసరా( Dasara ) సినిమా ఈనెల 30వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం నాని ముంబైలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాని తాను కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపారు.అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఇక్కడ ఏం జరుగుతుందో తనకు ఏ మాత్రం అర్థం అయ్యేది కాదని తెలిపారు.

ఇక ఇక్కడ పరిస్థితుల గురించి తనకు ఎవరు సహాయం చేసే వారు కూడా కాదని నాని తెలిపారు.ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎన్నో కష్టాలను పడ్డానని, అలాగే ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నానని తెలిపారు.ఇక ఒక డైరెక్టర్ షూటింగ్ లొకేషన్లో అందరూ చూస్తుండగానే నువ్వు నీ జీవితంలో డైరెక్టర్ కాలేవు అంటూ తనని ఘోరంగా అవమానించారని నాని తెలిపారు.ఈ విధంగా నాని తనకు జరిగిన అవమానాలు గురించి తెలియజేశారు.
అయితే అతనిని అవమానించిన డైరెక్టర్ పేరు మాత్రం ఈయన బయట పెట్టలేదు.అయితే ఆరోజు ఆ డైరెక్టర్ అవమానించడం వల్లే తనలో మరింత పట్టుదల పెరిగిందని నేను నేడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే పరోక్షంగా ఆ డైరెక్టర్ కూడా కారణమే అంటూ నాని చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
