పంటినొప్పి అంటూ డాక్టర్‌ వద్దకు వెళ్తే, ఆయన చేసిన పనితో ఆమె చనిపోయింది.. అసలేం జరిగిందంటే

కొండ నాలుకకు మందు వేస్తే, పెద్ద నాలుక ఊడినట్లు అనే సామెత తెలుగులో చాలా ఫేమస్‌.ఈ సామెత వైధ్యం చేసే వైధ్యుల విషయంలో చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది.

 The Dentist Doctor Puts Into Jail For Petiont Dead-TeluguStop.com

ఒక జబ్బుకు చికిత్స చేయకుండా మరో జబ్బుకు చికిత్స చేయడం అనేది గతంలో ఎంతో మంది డాక్టర్లు చేసిన పనే.ఒక జబ్బు కోసం అంటూ చికిత్సకు వెళ్తే మరో చికిత్స చేసి ప్రాణాలు తీసిన వైధ్యులు ప్రపంచంలో చాలా మందే ఉన్నారు.అందుకు వారు కఠిన శిక్షలు కూడా అనుభవించిన విషయం తెల్సిందే.

కుడి కన్ను కనిపించడం లేదని డాక్టర్‌ వద్దకు వెళ్తే ఎడమ కన్నుకు ఆపరేషన్‌ చేయడం, కడుపులో ఇబ్బంది అయితే గుండెకు ఆపరేషన్‌ చేయడం వంటివి ఎన్నో సంఘటనలు జరిగాయి.తాజాగా అలాంటిదే మరో సంఘటన జరిగింది.ఇంగ్లాండ్‌ లో 49 ఏళ్ల మహిళ కొన్ని వారాలుగా తీవ్రమైన పంటి నొప్పితో ఇబ్బంది పడుతూ వస్తుంది.

దాంతో ఆమె పంటి నొప్పిని తగ్గించేందుకు డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేశారు.ఆమె 9 పళ్లు పుచ్చి పోయాయి, అందుకు ఆపరేషన్‌ చేసి ఆమె పళ్లను తొలగించాలని వైద్యులు సూచించారు.

ఆపరేషన్‌ కోసం ప్రముఖ డెంటిస్ట్‌ అయిన రచెల్‌ జాన్సన్‌ వద్దకు ఆమె వెళ్లింది.ఎన్నో ఏళ్లుగా డెంటిస్ట్‌గా పని చేసిన అనుభవం ఉన్న ఆయన వద్దకు వెళ్లిన తర్వాత తన పంటి నొప్పి పూర్తిగా పోతుందని ఆమె భావించింది.ఆపరేషన్‌తో తన పంటి నొప్పిని డాక్టర్‌ దూరం చేస్తాడని భావించింది.ఆమె ఆశలు అడియాశలు అయ్యాయి.పంటి నొప్పి కాదు, ఏకంగా ప్రాణాలే తీసేశాడు.

పుచ్చి పోయిన పళ్లను కాకుండా వేరే పళ్లను ఆ డాక్టర్‌ తొలగించాడు.

ఆ తర్వాత తాను తప్పు చేశానని భావించి మళ్లీ పుచ్చి పోయిన పళ్లను తొలగించేందుకు సిద్దం అయ్యాడు.కొన్ని నిమిషాల వ్యవదిలోనే ఆమె 15 పళ్లను తొలగించాడు.

దాంతో అతడికి పరిస్థితి అర్థం అయ్యింది.ఆమె ఎక్కువ సమయం బతకదని భావించాడు.

తాత్కాలికంగా రక్తస్రావం కాకుండా చేసి వెంటనే ఆమెను డిచ్చార్జ్‌ చేశాడు.ఇంటికి వెళ్లిన గంట సేపటికి ఆమెకు తీవ్రమైన రక్త స్రావం అవ్వడంతో పాటు, అక్కడ వేసిన మత్తు మందు తగ్గి పోవడంతో ఆమె విపరీతమైన నొప్పితో తల్లడిల్లింది.

ఆ తర్వాత కొద్ది సమయంకు మృతి చెందింది.

ఆమె కుటుంబ సభ్యులు డాక్టర్‌ పై ఫిర్యాదు చేయడంతో, పోలీసులు విచారణలో తప్పుగా ఆపరేషన్‌ చేశానని, పుచ్చి పోయిన పళ్లను కాకుండా మంచి పళ్లను పీకేశాను, అన్ని పళ్లు ఒకేసారి పీకేయడం వల్ల ఆమె విపరీతమైన బాధతో చనిపోయిందని చెప్పుకొచ్చాడు.ఆమె కుటుంబ సభ్యులకు భారీ నష్టపరిహారం చెల్లించడంతో పాటు, జైల్లో పడ్డాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube