కరోనా మృతుల కుటుంబాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం.. !

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా అనే ఉగ్రవాదితో యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ పోరులో అన్నీ రాష్ట్రాల ప్రజలు తీవ్రమైన కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు.

 The Delhi Government Has Made A Key Decision In The Corona-TeluguStop.com

ఎన్నో కుటుంబాలు అయిన వారిని కోల్పోయి అనాధలుగా మారుతున్నారు.ఇంకా కొన్ని సంఘటనలు అయితే అత్యంత హృదయ విదారకంగా ఉంటున్నాయి.

మొత్తానికి ప్రజల జీవితాలు చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాయి.
ఇకపోతే ఈ కరోనా సంక్షోభంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

 The Delhi Government Has Made A Key Decision In The Corona-కరోనా మృతుల కుటుంబాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా కరోనా వల్ల అనాధలైన చిన్న పిల్లల విషయంలో.కాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.కరోనాతో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ.50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.అలాగే రేషన్ కార్డు ఉన్నవారందరికీ 10 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది.అదీగాక కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్యను, 25 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా 2500 పెన్షన్ అందజేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

ఎన్నికల్లో కోట్లకు కోట్లు తగిలేసే ప్రభుత్వాలు ఇలాంటి ఆపద సమయంలో ఆదుకుంటే పైస ఖర్చు లేకుండా ఓట్లు పడతాయని ఇకనైనా గ్రహిస్తే మంచిదని కొందరు అనుకుంటున్నారట.

#Delhi #Corona Crisis #CMAravind #Key Decision

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు