అమెరికాలో అంతు చిక్కని మరణాలు..కుప్పలు తెప్పలుగా పక్షుల మృతదేహాలు...!!!

అగ్ర రాజ్యం అమెరికా వరుసగా కరోనా వేరియంట్ లతో విసిగి వేసారి పోయింది.ఎంతో స్వేచ్చగా, ప్రశాంతంగా తిరిగే అమెరికన్స్ రోడ్లపై కి రావాలంటేనే వణికి పోయే పరిస్థితులు నెలకొన్నాయి.

 The Deadliest Deaths In America..piles Of Birds Floating In Piles And Rafts, Ant-TeluguStop.com

కరోనా సెకండ్ వేవ్ అమెరికాలో అనుకున్నంత ప్రభావం చూపకపోయినా డెల్టా వేవ్ తో మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ రానున్న రోజులు ఎంతో ప్రమాదకరమని ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే ఒక పక్క ఆంటోని ఫౌచీ డెల్టా వేరియంట్ లతో ప్రమాదమని చెప్తున్నా నేపధ్యంలోనే అమెరికాలో మరో అంతుచిక్కని వ్యాధి అమెరికన్స్ ను భయాందోళనలోకి నెట్టేస్తోంది.అమెరికాలో పక్షులు రోజుకు ప్రతీ చోటా కుప్పలు తెప్పలుగా రోడ్లపై పడి మృతి చెందటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అసలు ఏ వ్యాధితో పక్షులు మరణనిస్తున్నాయో కూడా తెలియడం లేదని నిపుణులు అంటున్నారు.జంతు పరిరక్షణ అధికారులు, కొందరు పరిశోధకులు ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.

వాషింగ్టన్ మాత్రమే పక్షుల మృతి చెందటం లేదని, అమెరికాలో దాదాపు తొమ్మిది రాష్ట్రాలలో పక్షులు ఇలాంటి వింత వ్యాధితో చనిపోతున్నాయని ప్రకటించారు.ఈ వ్యాధి సోకిన పక్షుల కళ్ళు పెద్దగా అయ్యి ఒక్క సారిగా స్పృహ కోల్పోయి పడిపోతున్నాయని, ఈ రకమైన మరణాలు ఇప్పటి వరకూ చూడలేదని అంటున్నారు అమెరికా జంతు పరిరక్షణ సంస్థలు, వైద్య పరిశోధకులు.

మొట్టమొదటి సారిగా ఏప్రియల్ లో ఇలాంటి కేసులు గుర్తించామని, ఆ తరువాత జులై నెలలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, త్వరలో ఇందుకు గల కారణాలు గుర్తించి పరిష్కరిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube