రాశుల ప్రకారం మీలో ఉండే లోపాలు... సరిదిద్దుకుంటే విజయము మీ సొంతం...ఎలా?   The Dark Side Each Zodiac Sign     2018-01-11   22:13:05  IST  Raghu V

ఒక్కో రాశి వారికి ఒక్కో లోపం ఉండటం సహజమే. ఒక్కోసారి ఆ లోపల కారణంగా ఎన్నో ఇబ్బందులను పడవలసి రావచ్చు. మీ రాశి ప్రకారం ఆ లోపాన్ని తెలుసుకుంటే ముందే జాగత్త పడవచ్చు.

మేషం
ఈ రాశి వారు ప్రతి చిన్న విషయానికి అలిగి అవతలి వ్యక్తిని అపార్ధం చేసుకుంటారు. వీరు కాస్త చిన్న పిల్లల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు.

వృషభం
ఈ రాశి వారు ఎదుటి వారి మాటను అసలు వినరు. వీరికి ఏది నచ్చితే అదే చేస్తారు. అలాగే మొండి పట్టుదల,కాస్త సోమరితనం ఉంటాయి. కాస్త గర్వం కూడా ఎక్కువే.

మిధున రాశి
ఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వీరు అవతలి వ్యక్తులు వింటున్నారా అనేది చూసుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు. దాంతో అవతలి వ్యక్తులు కాస్త ఇబ్బంది పడతారు. వీరు అందరిని తొందరగా నమ్మేస్తారు.


కర్కాటకం
ఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండుట వలన ఎప్పుడు మూడీగా ఉంటారు. ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేరు. వీరు చాలా పిరికిగా ఉంటారు.

సింహ రాశి
ఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. వారి గురించి వారే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వీరిని ఎవరైనా పట్టించుకోకున్నా, నిర్లక్ష్యం చేసినా అవతలి వ్యక్తిని ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేయాలనే ఆలోచన కలిగి ఉంటారు.

కన్య
ఈ రాశి వారు తనే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. తన వంటి మంచివాళ్ళు ఎక్కడ ఉండరని తెగ ఫిల్ అవుతూ ఉంటారు. దాంతో వీరికి మర్యాద తగ్గుతూ ఉంటుంది.

తుల రాశి
ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ సందేహంగా ఉంటారు. నిర్ణయం తీసుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా చిన్న విషయాలకే ఇబ్బంది పడుతూ ఉంటారు.

వృశ్చికరాశి
ఈ రాశి వారు ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం అసలు ఉండదు. ఈ విషయాన్నీ మనస్సులో పెట్టి ఎదుటి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు.

ధనుస్సు
ఈ రాశి వారు విసుగు ఎక్కువగా ఉండుట వలన ఏ పని మీద శ్రద్ద ఉండదు. ప్రతి చిన్న విషయానికి నిరాశ పొందుతారు. అందువల్ల వీరు చేసే ఏ పనిలోనూ అంతగా రాణింపు ఉండదు.

మకరం
మకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. వీరు ఎలాంటి కారణం లేకుండానే కోపానికి గురవుతుంటారు. వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.

కుంభరాశి
కుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు. కానీ వారి లోపాల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు. అంతేకాకుండా వీరు అవతలి వ్యక్తి చెప్పేది కూడా వినరు. వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.

మీనరాశి
మీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు. వీరు చిన్నచిన్న విషయాలకే కుంగిపోతుంటారు. చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు. ఇతరులపై కుట్రులు పన్నలేరు. ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.