మగ తోడు లేకుండా పిల్లకు జన్మనిచ్చిన మొసలి.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు..

అమెరికా శాస్త్రవేత్తలు మొసళ్ల ( Crocodile )గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు.ఆడ మొసళ్లు మగ మొసలి సహాయం లేకుండానే పిల్లలకు జన్మనివ్వగలవని వాళ్ళు తెలుసుకున్నారు.

 The Crocodile Gave Birth To A Baby Without A Male Companion.. Scientists Are Sur-TeluguStop.com

నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం.వాస్తవానికి బల్లులు, పాములు ఇతర రకాల పక్షులు మగ జీవి తోడు లేకుండానే పిల్లలకు జన్మనిస్తుంటాయి.

తాజాగా తొలిసారిగా ఒక ఆడ మొసలి మగ మొసలితో లైంగికంగా కలవకుండానే గుడ్లను పెట్టింది.

కోస్టారికాలోని( Costa Rican zoo ) ఒక జూలో ఉంచిన ఈ మొసలి 2018లో కొన్ని గుడ్లు పెట్టింది.కొన్ని నెలల తర్వాత, ఒక గుడ్డు లోపల ఒక మొసలి పిల్ల తయారైంది.కానీ దురదృష్టవశాత్తు, అది చచ్చిపోయింది.

మిగతా గుడ్లు అసలు పిల్లలు కాలేదు.అయితే శాస్త్రవేత్తలు చనిపోయిన మొసలి పిల్లను అధ్యయనం చేసినప్పుడు, ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు.

అదేంటంటే మగ మొసలి సహాయం లేకుండా ఈ గుడ్లను ఆడ మొసలి పెట్టిందని వారు గుర్తించారు.సాధారణంగా, ఒక మగ, ఆడ మొసలి కలిసినప్పుడు ఒక పిల్ల మొసలి తయారవుతుంది.

మగ మొసలి స్పెర్మ్ ఆడ మొసలి అండాన్ని ఫలదీకరణం చేసినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది.అయితే తాజా కేసులో మాత్రం ఆడ మొసలి మగమొసలి సహకారం లేకుండా గుడ్లను పెట్టింది.

జంతువులలో ఇలాంటివి కనిపించడం ఇదే మొదటిసారి కాదు.దీనిని “కన్య జననం” లేదా “వర్జిన్ బర్త్( Virgin birth )” అని పిలుస్తారు.ఇలాంటి వింత జననాలు చేపలు, పక్షులు, బల్లులు, పాముల వంటి ఇతర జంతువులలో తరచుగా కనిపిస్తుంటాయి.ఈ ఆవిష్కరణ కారణంగా, శాస్త్రవేత్తలు ఇప్పుడు కొన్ని డైనోసార్లు, ఇతర పురాతన జంతువులు కూడా మగ తోడు లేకుండా పిల్లలను కని ఉండవచ్చని నమ్ముతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube