'దృశ్యం' సినిమా చూసి హత్య చేశారు.. రెండేళ్లు పోలీసులు జట్టు పీక్కున్నారు, చివరకు ఇలా పట్టుబడ్డారు

మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ చిత్రం తెలుసు కదా, తెలుగులో అదే పేరుతో మన వెంకటేష్‌ కూడా చేశాడు.శ్రియ హీరోయిన్‌గా నటించిన ఆ సినిమాలో ఒక తప్పుడి కుర్రాడిని హత్య చేసి, ఆ హత్యను కప్పిపుచ్చేందుకు హీరో ఫ్యామిలీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో తెలిసింది.

 The Crime Story Like Drishyam Movie-TeluguStop.com

తన కుటుంబంలోకి వచ్చిన ఒక చెత్త పురుగును హత్య చేసిన హీరో ఆ హత్య కేసును తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు.చాలా ఇబ్బందులు పడతాడు.

హత్య చేసి కుర్రాడిని పూడ్చి పెట్టిన స్థలం నుండి మళ్లీ ఆ శవంను తొలగించి ఒక పెద్ద పందిని పూడ్చి పెడతాడు.

అచ్చు ఇలాంటి క్రైమ్‌ మద్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లో జరిగింది.ఈ యదార్థ దృశ్యం కథ విషయానికి వస్తే.ఇండోర్‌కు చెందిన ట్వింకిల్‌ అనే 22 ఏళ్ల యువతికి స్థానిక బీజేపీ నాయకుడు 65 ఏళ్ల జగదీష్‌ కరోటియాతో అక్రమ సంబంధం ఏర్పడినది.

ఆమెను వాడుకున్నన్ని రోజులు వాడుకున్న జగదీష్‌ ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు.

ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో కొడుకులతో కుట్ర పన్ని ఆమెను చంపేశారు.తనకంటే 43 సంవత్సరాల చిన్న వయస్సు ఉన్న అమ్మాయితో దాదాపు రెండు సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినట్లుగా తిరిగిన జగదీష్‌ ఉన్నట్లుండి ఆమెను వదిలేస్తే అనుమానం వస్తుందని వారికి తెలుసు.అందుకే ఆ సమయంలోనే హిందీలో వచ్చిన దృశ్యం చిత్రాన్ని చూసి హత్యకు ప్లాన్‌ చేశారు.

ముందుగా అనుకున్న ప్రకారం ట్వింకిల్‌ను చంపేశారు.ఆమెను ఎవరికి తెలియకుండా కాల్చేశారు.బూడిద కూడా ఆనవాల్లు లేకుండా చేశారు.ఆ ప్రదేశంలోనే ఒక కుక్కను పాతి పెట్టారు.దాంతో పోలీస్‌ డాగ్స్‌ అక్కడ ట్వింకిల్‌ శరీరాన్ని కాల్చి వేసినట్లుగా పసిగట్టలేక పోయాయి.అక్కడ ఏదో మృత దేహం ఉందని పోలీసులు గుర్తించి తోడి చూడగ కుక్క మృతదేహం.

ఈ కేసు రెండు సంవత్సరాల పాటు సాగింది.పోలీలు ఎంక్వౌరీని క్లోజ్‌ చేయాలనుకున్న సమయంలో ఘటన స్థలంలో జగదీష్‌కు చెందిన చిన్న గోల్డ్‌ రింగ్‌ కనిపించింది.

దాని ద్వారా తీగ లాగితే డొంక అంతా కదిలింది.కేసు విషయం తెలుసుకున్న జగదీష్‌ తప్పించుకునేందుకు ప్రయత్నించినా కూడా అతడి కొడుకులతో సహా పోలీసులకు చిక్కి పోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube