అందుకోసమే ఆవుని పెంచుకుంటున్న సీఎం !  

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ మరో సారి వార్తల్లోకెక్కారు. తాను పాల కోసం సీఎం అధికారిక నివాసంలో ఆవును పెంచుకుంటున్నట్లు త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ ప్రకటించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రజలు తనను స్ఫూర్తిగా తీసుకొని ఆవులను పెంచుకోవాలని విప్లవ్‌దేవ్ కోరారు. తనతోపాటు తన కుటుంబం ఆవుపాలనే తాగుతామని సీఎం చెప్పారు.

The Cow Is Growing In Tripura CM-

The Cow Is Growing In Tripura CM

త్రిపుర రాష్ట్రంలో త్వరలో ఐదువేల కటుంబాలకు ఆవులను పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. పదివేల కోట్లరూపాయలు వెచ్చించి రెండువేల మందికి ఉపాధి కల్పించే బదులు పదివేల ఆవులను ఐదువేల కుటుంబాలకు అందజేస్తే వారికి ఆరునెలల్లో సంపాదిస్తారని సీఎం పేర్కొన్నారు. యువకులు ఖాళీగా ఉండకుండా ఆవులను పెంచాలని, పాన్ షాపులు పెట్టుకోవాలని గతంలో సీఎం విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.