నల్గొండ , జిల్లాలోని హాలియా సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో ప్రియురాలిని కాపాడారు.
ప్రియుడు బాలకృష్ణ(23) గల్లంతయ్యాడు.ప్రేమజంట పీఏపల్లి మండల వాసులుగా పోలీసులు గుర్తించారు.
పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.వీరు వరసకు బావమరదలు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
.