అతనిపై ఏకంగా జీవితకాల నిషేధం విధించిన కౌంటీ క్రికెట్ క్లబ్..?!

క్రికెట్ చరిత్రలో జీవితకాలం నిషేధం విధించిన వారిలో చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పుకోవచ్చు.మహ్మద్ అజారుద్దీన్, సలీం షేక్, అజయ్ జడేజా వంటి వారిపై నిషేధం విధించారు కానీ దశాబ్ద కాలంలోనే వారిపై నిషేధం ఎత్తివేశారు.

 The County Cricket Club Imposed A Life Ban On Him Cricket, Stadium, Life Time, S-TeluguStop.com

మోసాలు, కుట్రలు, మ్యాచ్ ఫిక్సింగ్, గ్యాంబ్లింగ్ ఇలాంటి పనులు చేస్తే బ్యాన్ అవ్వడం ఖాయం.కానీ ఒక వ్యక్తి ఇవేమీ చేయకుండానే లైఫ్ టైం బ్యాన్ కు గురయ్యాడు.

లార్డ్స్‌లో టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రెండు, మూడో టెస్టులు జరుగుతున్న సమయంలో మైదానంలోకి వచ్చినందుకే అతడిపై లైఫ్ టైం బ్యాన్ పడింది.

అందులో తప్పేముంది అనుకుంటున్నారా నిజానికి క్రికెటర్ గా మైదానంలో అడుగుపెట్టిన ఆ వ్యక్తి పేరు జార్వో కాగా అతను నిజంగా క్రికెటర్ కాదు.కేవలం ఒక అభిమాని మాత్రమే.

ఇతను గడిచిన కొద్ది రోజుల్లో సీరియస్‌గా మ్యాచులు సాగుతున్నప్పుడు బ్యాట్ మెన్ గా క్రీజులోకి దూసుకొచ్చి అద్భుతంగా నటించేశాడు.తాను నిజంగానే క్రికెటర్‌ను అని చెబుతూ అతనిచ్చిన ఎక్స్ప్రెషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

Telugu Cricket, Latest, Time, Stadium, Ups-Latest News - Telugu

మూడవ టెస్టులోనూ అతను సెక్యూరిటీ నిబంధనలను అతిక్రమించి క్రీజులోకి వచ్చాడు.దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ జార్వోపై జీవితకాల నిషేధం విధించింది.అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో సెక్యూరిటీని కూడా లెక్కచేయకుండా దురుసుగా ప్రవర్తించారని అతనిపై ఆగ్రహం వెళ్లగక్కింది.సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా బయటికి పంపించేంతవరకూ అతను మైదానం నుంచి కదల లేదు.

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కౌంటీ క్రికెట్ క్లబ్ స్పష్టం చేసింది.భారత జెర్సీ ధరించి నిజమైన క్రికెటర్ గా క్రీజులోకి చొచ్చుకొచ్చిన ఇతడు ఇకపై హెడ్డింగ్‌లేలో మ్యాచ్ చూడలేడు.

దాంతో పాటు అతను ఎంతో కొంత జరిమాన చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube