ప్ర‌పంచంలోనే ఎత్తైన వారిగా ఉన్న ఆ దేశ జ‌నాభా పొట్టివార‌వుతున్నారంట‌..

ఆరడుగుల ఎత్తు ఉన్న వారిని ఆజానుభాహులుగా పిలుస్తుంటారు.ఇలాంటి వారికే అమ్మాయిలు తెగ లైక్ చేస్తుంటారు.

 The Countrys Population Which Is The Tallest In The World Is Shrinking, Nedarlan-TeluguStop.com

అయితే ఇలా పొడుగ్గా ఉండాల‌ని అంద‌రికీ ఉంటుంది.అయితే ఇలాంటి పొడుగైన వారు ఓ దేశంలో మాత్రం ఎక్కువ‌గా ఉంటారు.

ఆ దేశంలో పురుషులతో పాటు మహిళలు కూడా చాలా ఎత్తుగా అంటే ఆర‌డుగుల వ‌ర‌కు ఉంటారు.దాంతో ఆ దేశానికి ప్రపంచంలో పొడవైన మ‌నుషులు ఉన్న దేశంగా పేరు వ‌చ్చింది.

అదే నెదర్లాండ్స్‌.ఈ దేశంలో ప్రపంచంలో కెల్లా ఎత్తు అయిన మ‌నుషులు ఉంటారు.

అయితే ఇప్పుడు ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోతోంది.ఇలా ఎత్తైన జనాభా ఉన్న దేశంగా నెద‌ర్లాండ్స్ దాదాపు ఆరు దశాబ్ధాలుగా రికార్డుల‌కు ఎక్కింది.కానీ ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోతున్న‌ట్టు తెలుస్తోంది.ఎందుకంటే తాజాగా జ‌రిపిన అధ్యయనంలో వీరంతా పొట్టిగా మారుతున్న‌ట్టు తెలిసింది.ఈ దేశంలో మునుపటి తరం మ‌నుషుల కంటే కూడా ఈ త‌రం మ‌నుషులు వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా ఎత్తు త‌గ్గుతున్నారంట‌.1980 శ‌కంలో జీవించిన వారితో పోలిస్తే 2001శ‌కంలో పుడుతున్న వారా కొంచెం పొట్టిగా ఉంటున్నారని తెలుస్తోంది.

Telugu Nedarland, Nehterlands, Netherlands-Latest News - Telugu

1980లో ఉన్న పురుషుల‌తో పోల్చిన‌ప్పుడు 2001లో జీవిస్తున్న వారు కనీసం 1 సెంటీ మీటర్ హైట్ త‌క్కువ‌గా ఉన్నార‌ని ఈ స‌ర్వేలో తెలుస్తోంది.ఇక ఈ దేశంలో మహిళల విష‌యానికి వ‌స్తే దాదాపుగా 1.4 సెం.మీ వ‌ర‌కు ఎత్తు తగ్గిపోయార‌ని స‌ర్వే వివ‌రించింది.అయితే ఈ విధ‌మైన అంశాల గురించి తెలుసుకునేందుకు నెద‌ర్లాండ్స్ లోని 19 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వారిని ప‌రిశీలించగా ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.కావాల్సినంత పౌష్టికాహారం ఇప్ప‌టి త‌రానికి అంద‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇలా ఎత్తు త‌గ్గిపోతున్నార‌ని తేలింది.

ఇప్ప‌టి త‌రం వారు ఈ విధ‌మైన పోష‌కాహారం తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇలాంటి ప‌రిస్థితులు వ‌స్తున్నాయంట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube