కోహ్లీపై ఆ దేశపు ఆటగాడు సంచలన వ్యాఖ్యలు...

భారత్-ఇంగ్లాండ్ మధ్య హోరాహోరీ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ టెస్ట్ మ్యాచ్ లో 2-1తో భారత్ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.

 The Countrys Player Sensational Comments On Kohli-TeluguStop.com

అయితే మొతేరా టెస్ట్ లో మ్యాచ్ రెండు రోజులలో ముగియడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.పిచ్ సహకరించడంతోనే భారత్ ఈ టెస్టులో విజయం సాధించగలిగినదని పలువురు మాజీలు పెదవి విరిచారు.

అయితే ఈ వివాదంపై కోహ్లీ స్పందిస్తూ పిచ్ సరిగ్గానే ఉందని, బ్యాట్స్ మెన్ వైఫల్యం వల్లే ఇరుజట్లు ఓడిపోవలసి వచ్చిందని, బౌలర్ వేసిన బంతిని డిఫెండ్ చేసుకోవడంలో బ్యాట్స్ మెన్ విఫలమయ్యారని కోహ్లీ అన్నాడు.

 The Countrys Player Sensational Comments On Kohli-కోహ్లీపై ఆ దేశపు ఆటగాడు సంచలన వ్యాఖ్యలు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కోహ్లీ వ్యాఖ్యలపై అలెస్టర్ కుక్ స్పందించాడు.

బ్యాట్స్ మెన్ వైఫల్యం వల్లే ఇంగ్లాండ్ ఓడిపోయినది అనడం సరికాదని, బాల్ సరిగ్గా వికెట్ల వైపు వస్తుంటే బ్యాట్స్ మెన్ ఎలా అడగలుగుతారని కుక్ అభిప్రాయ పడ్డారు.అయితే ఈ పిచ్ పై ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఇలాంటి మ్యాచ్ లు మరిన్ని కొనసాగితే టెస్ట్ మ్యాచ్ మనుగడకే ప్రమాదమని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.

అయితే రెండు రోజుల్లో టెస్ట్ మ్యాచ్ లు ముగియడం సబబు కాదని,టెస్ట్ క్రికెట్ అంతరిచిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.అయితే నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ జరుగుతుందనుకున్న ఫ్యాన్స్ రెండు రోజులే మ్యాచ్ జరగడంతో టిక్కెట్స్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

.

#@imVkohli #England Cricket #Indian Cricket #@ViratKohli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు