దేశం ప్రమాదంలో ఉంది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు..!!

దేశంలో వైరస్ విజృంభణ భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.ఊహించని విధంగా కేసుల సంఖ్య అతి తక్కువ కాలంలోనే ఐదు రెట్లు పెరిగిపోవటం తో దేశం ప్రమాదంలో పడినట్లే అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో దేశంలో ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని, భౌతిక దూరం పాటిస్తూ నోరు, మొహం కవర్ అయ్యే విధంగా మాస్కు ధరించాలని  పేర్కొన్నారు.

Telugu Corona, Maharashtra-Telugu Political News

కరోనా నిబంధనలు పాటించకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.దేశంలో పలు జిల్లాలలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని.యావత్ దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితిని కట్టడి చేయకపోతే .మూల్యం గట్టిగా చెల్లించాల్సి వస్తుంది అన్నట్టు తెలిపారు.దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ 5 లక్షలు దాటిందని చెప్పింది.ప్రస్తుతం 5,40,720 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.దాదాపు దేశవ్యాప్తంగా పది జిల్లాలలో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నట్లు వీటిలో మహారాష్ట్ర లోనే  8 జిల్లాలు ఉన్నాయని సోషల్ మీడియాలో స్పష్టం చేశారు.ఆ ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube