వామ్మో, చెత్త పారేసే బ్యాగ్ ధర అక్షరాలా రూ.1.42 లక్షలు.. దాని ప్రత్యేకతలివే..!

సాధారణంగా చెత్తను స్టోర్ చేసే కవర్ లేదా బ్యాగ్ ధర ఎంతుంటుంది? మహా అంటే రూ.50 ఉంటుందేమో! అయితే ఒక చెత్త బ్యాగ్ మాత్రం ఏకంగా లక్షల రూపాయల ధర పలుకుతోంది.దీనిని చెత్త పారడానికే ఉపయోగిస్తారు.అంతకుమించి దాంతో చేసేదేమీ లేదు.మరి అలాంటిది దీనికి లక్ష రూపాయలు ఎవరు పెడతారని అనుకోకండి.ఎందుకంటే వీటిని కొనుగోలు చేయడానికి ధనవంతులు సిద్ధమైపోతున్నారు.

 The Cost Of Garbage Disposal Bag Is Literally Rs.1.42 Lakhs , Viral Latest, News-TeluguStop.com

వివరాల్లోకి వెళితే, స్పెయిన్‌కు చెందిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బలెంసియాగా (Balenciaga) వస్తువులకు వరల్డ్ వైడ్ గా బాగా గిరాకీ ఉంది.అయితే తన బ్రాండ్ వాల్యూని ఉపయోగించుకొని ఈ కంపెనీ రకరకాల వస్తువులను తయారు చేసి భారీగా డబ్బులు వెనకేసుకుంటోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్రాండ్ ఓ చెత్త బ్యాగ్‌ను తయారుచేసి, దాని ధరను ఏకంగా 1800 డాలర్లగా నిర్ణయించింది.అంటే మన డబ్బుల్లో అక్షరాలా రూ.1.42 లక్షలు! స్టన్ అయ్యారు కదా, కానీ మీరు చదివింది అక్షరాలా నిజం.బాగా డబ్బు ఉన్నవారి కోసమే దీన్ని ప్రత్యేకంగా కంపెనీ రూపొందించింది.ఈ బ్యాగ్ నలుపు, తెలుపు, ఎరుపు, నీలం కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుంది.దీనికింత ధర ఎందుకంటే, ఈ ట్రాష్ బ్యాగ్‌ను దూడ చర్మంతో తయారు చేస్తారట.మరి దాన్ని వాడటం వల్ల ఏమైనా రోగాలు వస్తాయా? అనేది మాత్రం కంపెనీ ఇంకా తెలపలేదు.ఈ బ్యాగ్‌ను 2022, మార్చిలో పారిస్‌లోని రెడీ టు వేర్ కలెక్షన్‌లో ఎగ్జిబిషన్ కి పెట్టారు.అయితే ఇప్పుడు ఇవి Balenciaga బ్రాండ్‌ స్టోర్‌లలో క్రమ క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి.

Telugu Calfskin, Costgarbage, Garbagedisposal, Bag, Latest-Latest News - Telugu

చెత్త బ్యాగ్ కూడా స్టైల్ గా ఉండాల్సిన అవసరం ఏముందని అడిగితే… చెత్త బ్యాగ్ కూడా ఫ్యాషన్ గా ఉండటంలో తప్పేముందని Balenciagas క్రియేటివ్ డైరెక్టర్ డెమ్న జీవశాలియా ఎదురు ప్రశ్నిస్తున్నారు. నెటిజన్లు మాత్రం ఫ్యాషన్ పేరుతో ఇలా అడ్డగోలుగా డబ్బులు వసూలు చేయడం సరికాదని పేర్కొంటున్నారు.అయినా దీనిని ఎవరూ కొనుగోలు చేస్తారని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.ఏదేమైనా ఈ చెత్త బ్యాగ్ ధర ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube