చైనా కుట్రను బయటపెట్టిన ఆస్ట్రేలియా.. కలకలం రేపుతున్న పత్రిక కథనం.. ?

ప్రపంచాన్ని ప్రమాదం అంచుల్లోకి తీసుకెళ్లుతున్న కరోనా ఎలా పుట్టింది అనే విషయం ఇప్పటికి రహస్యంగానే ఉంది.కానీ కొందరు మాత్రం చైనా దేశమే కరోనా వైరస్ పుట్టుకకు కారణం అనే ఆరోపణలను బలంగా వినిపించారు.

 Australian Media China Coronavirus-TeluguStop.com

ఇదంతా గత సంవత్సరం జరిగిన ముచ్చట.ఆ తర్వాత అందరు ఈ విషయాన్ని మరచిపోయారు.

కానీ తాజాగా మరోసారి ఈ వైరస్ అంశం తెరపైకి వచ్చింది.

 Australian Media China Coronavirus-చైనా కుట్రను బయటపెట్టిన ఆస్ట్రేలియా.. కలకలం రేపుతున్న పత్రిక కథనం.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించేందుకు చైనా కృత్రిమంగా తయారుచేసిన జీవాయుధమే కరోనా వైరస్ అని ఈ మహమ్మారి పై వీకెండ్ ఆస్ట్రేలియన్ పత్రికలో ప్రచురితమైన ఓ కథనం ప్రస్తుతం కలకలం రేపుతోంది.

ఈ విషయంలో చైనాపై ఉన్న అనుమానాలు నిజమేనని ఈ కథనం చెబుతోంది.

కాగా చైనా మూడో ప్రపంచ యుద్ధంలో జీవాయుధంగా ఉపయోగించేందుకు ఈ వైరస్‌ను అభివృద్ధి చేసిందని, ఇందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని ఈ పత్రిక రాసుకొచ్చింది.

దీనికి సంబంధించి 2015లో చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు రూపొందించిన ఓ నివేదిక తాజాగా వెలుగులోకి రావడం తో ప్రపంచవ్యాప్తంగా ఈ కధనం తీవ్ర చర్చనీయాంశమైంది.

అయితే బయటి సంస్థలు దర్యాప్తు జరిపితే వైరస్ మూలాల గుట్టు ఎక్కడ బయటపడిపోతుందోననే ఉద్దేశంతోనే బయటి సంస్థల దర్యాప్తును చైనా వ్యతిరేకించిందని పత్రిక పేర్కొంది.

ఈ వినాశనానికి మూలం తామే అనే నిజాన్ని దాచీ ప్రపంచాన్ని నమ్మించేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఈ పత్రిక పేర్కొందట.

#AustralianMedia #Corona Virus #Made In China

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు