విజయవాడ:బాబు, జగన్, పవన్ అంటే బి.జే.
పి.కి నిర్వచనమని ఏ.పి.సి.సి అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు( Gidugu Rudra Raju ) గారు వివరించారు.ఈ రోజు విజయవాడ ఆంధ్ర రత్న భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ దేశంలో బి.జే.పి.ని ప్రజలు అసహించుకుంటున్నారు అని అన్నారు.వచ్చే ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress ) అధికారం చేపడుతుందని శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి అవుతారని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతి పక్ష నాయకులూ శ్రీ భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కె.సి.ఆర్.ప్రభుత్వం పతనం కాబోతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని తెలిపారు.
మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మేసి ప్రయివేటు వ్యక్తులకు అమ్మేస్తుందని దీనివల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని, కేంద్రంలోని బి.జె.పి.ప్రభుత్వాన్ని దేశ ప్రజలు నమ్మి మోసపోయారన్నారు.తాను చేసిన పాద యాత్ర 308 రోజులు దిగ్విజయంగా సాగింది అని ప్రజల సమస్యలు తెలుసుకున్నానని అన్నారు.ఈ పత్రిక విలేకరుల సమావేశంలో రుద్రరాజు గారితోపాటు భట్టి విక్రమార్క గారు వర్కింగ్ ప్రెసిడెంట్లు మస్తాన్ వలి గారు, సుంకర పద్మశ్రీ గారు, ఎ.ఐ.సి.సి.సభ్యులు మేడ సురేష్ గారు, యువజన జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ రక్ష రామయ్య, ఐ.వై.సి.శ్రీ మమతా నాగిరెడ్డి గారు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ లక్కరాజు రామారావు పాల్గొన్నారు.అధ్యక్షులు శ్రీ రుద్రరాజు గారు శ్రీ భట్టి విక్రమార్కను శలువాతో సన్మానించారు.







