ఇక ఉద్యమాల బాట పట్టనున్న కాంగ్రెస్ నేతలు... మరి ఈ సారైనా?

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో తమ పార్టీకి ఉన్న వాస్తవ పరిస్థితి గురించి ఇప్పుడిప్పుడే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందనతో కొంత మేర నిరాశకు గురయ్యారని సమాచారం.

 The Congress Leaders Who Will Follow In The Footsteps Of The Movements For Peopl-TeluguStop.com

కొన్ని ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇలా ప్రజల నుండి స్పందన కరువవడం జీర్ణించుకోలేక పోతున్నట్టు తెలుస్తోంది.ఇక కరోనా పరిస్థితులు కొంచెం సద్దుమణిగిన తరువాత కాంగ్రెస్ ముఖ్య నాయకులు భేటీ అయి ఒక పకడ్బంధీ కార్యాచరణ చేపట్టబోతున్నట్టు సమాచారం.

ఇక విమర్శలు, ప్రతి విమర్శలను ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవడం లేని పరిస్థితులలో ఇక ఉద్యమాల బాటతోనే రాష్ట్రమంతా అలజడి సృష్టించొచ్చనే వ్యూహరచన చేస్తున్నారు.ఎందుకంటే త్వరలో ఇక సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగనున్న నేపథ్యంలో అప్పటికప్పుడు కార్యాచరణ చేపడితే ఎన్నికల స్టంట్ గా ప్రజలు భావించే ప్రమాదం ఉంది.

అప్పుడు ఇక మొదటికే మోసం వస్తుంది.ఇక మరల కేసీఆర్ కు ఎన్నికల ప్రచార ఆయుధాన్ని ఇచ్చినట్లు అవుతుంది.

చూద్దాం మరి కాంగ్రెస్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయనేది చూడాల్సి ఉంది.ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో  కాంగ్రెస్ ను క్షేత్ర స్థాయిలో బలపరచవలసిన అవసరం ఉంది.

ఇప్పటికే కాంగ్రెస్ నేతలు దీనిపై అంతర్గత కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.మరి ఈ సారైనా కాంగ్రెస్ నేతల వ్యూహాలు ఫలిచి అధికార పార్టీకి ఎంతవరకు ఫలిస్తాయనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube