కాంగ్రెస్ ఆశలూ పీకే పైనే ? కలవరిస్తున్న రాహుల్ ? 

దేశవ్యాప్తంగా  కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.పార్టీ నాయకుల్లో పూర్తిగా నిస్తేజం అలుముకుంది.

 The Congress Is Going To Appoint Prashant Kishore As A Political Strategist-TeluguStop.com

పార్టీని ఒక గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటున్నా అది సక్సెస్ కావడం లేదు .బిజెపి పై వ్యతిరేకత పెరుగుతున్నా,  కాంగ్రెస్ కు మాత్రం అది కలిసి రావడం లేదు.

దీనికితోడు ప్రాంతీయ పార్టీలు బలమైన కూటమిగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇవన్నీ కాంగ్రెస్ లో మరింత ఆందోళన పెంచుతున్నాయి.

 The Congress Is Going To Appoint Prashant Kishore As A Political Strategist-కాంగ్రెస్ ఆశలూ పీకే పైనే కలవరిస్తున్న రాహుల్  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంతో పోలిస్తే రాహుల్ శక్తి సామర్ధ్యాలు పెరిగినట్లుగా కనిపిస్తున్నాయి.అయినా కాంగ్రెస్ కు ఆశాజనకమైన వాతావరణం కనిపించకపోవడంతో రాజకీయ వ్యూహకర్త అవసరం ఏర్పడింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగుతోంది.

 రాజకీయ వ్యూహకర్తగా ఆయన ఏ పార్టీ తరపున పని చేసినా, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేస్తూ ఉండడంతో పీకే సేవలను ఉపయోగించుకునేందుకు అన్ని పార్టీలు పోటీపడ పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు కాంగ్రెస్ సైతం ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకునే పనిలో బిజీగా ఉంది .గతంలోనే కాంగ్రెస్ కి వ్యూహకర్తగా పనిచేయాలని ప్రశాంత్ కిషోర్ ను కోరినా ఆయన తిరస్కరించారు.అయితే ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రశాంత్ కిషోర్ ను సంప్రదించి ఆయనను ఒప్పించినట్లు తెలుస్తోంది.దీంతో కాంగ్రెస్ తరఫున వ్యూహాలు రూపొందించేందుకు  ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Aicc, Bjp, Congress, Congress Seniour Leaders, Modhi, Pk, Prasanth Kishore, Rahul Gandhi-Telugu Political News

 అయితే ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాలు తీసుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయట.అయినా రాహుల్ మాత్రం ప్రశాంత్ కిషోర్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సీనియర్లన సైతం పక్కనపెట్టి వ్యవహారాలు చేస్తుండటంపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది.బిజెపికి గతంలో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీని ఇప్పుడు బద్ధశత్రువుగా చూస్తుండడం ,బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తూ , ప్రాంతీయ పార్టీలను అధికారంలోకి తీసుకు వస్తుండటం వంటివి కాంగ్రెస్ కు కలిసి వస్తున్నాయి.అయితే ప్రశాంత్ కిషోర్ నేరుగా రాజకీయ వ్యూహాలు రూపొందించకపోయిన తన టీమ్ ను కాంగ్రెస్ కోసం రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

#AICC #CongressSeniour #Rahul Gandhi #Modhi #Congress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు