పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ? జంబో కమిటీల్లో ఎవరేవరంటే ?

ఎప్పుడూ ఊరిస్తూ .ఉబ్బిస్తూ అన్నట్టుగా వస్తున్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ మొదటి నుంచి ఉత్కంఠ గానే ఉంటూ వస్తోంది.

 Telangana, Tpcc, Telangana Congress President, Revanth Reddy, Uttam Kumar Reddy,-TeluguStop.com

కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడం అంటే అది కత్తిమీదసామే అన్నట్లుగా కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తోంది.అలాగే రేవంత్ రెడ్డికి పిసిసి పీఠం కట్ట పెడదామని అధిష్టానం బలంగా ఫిక్స్ అయినా, కాంగ్రెస్ సీనియర్లు మాత్రం అధిష్టానానికి బెదిరింపులతో కూడదు వినతులు ఇస్తూ ఉండడంతో, ఆ ప్రక్రియకు బ్రేక్ వేసుకుంటూ వస్తున్నారు.

అయితే అలా నెలలు నెలలు గడిచిపోతుండడం, మరోవైపు బీజేపీ తెలంగాణలో బలపడుతూ టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న తీరు, ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి.

Telugu Damodar Reddy, Komati Venkata, Konda Surekha, Rahul Gandi, Revanth Reddy,

అందుకే ఈ ఎంపిక ప్రక్రియను ఇప్పుడు శరవేగంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.కొత్త పిసిసి అధ్యక్షుడు స్థానం కోసం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మధుయాష్కిగౌడ్ ఇంకా అనేక మంది నేతలు పోటీ పడుతున్నా, ప్రధాన పోటీ అంతా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాదే నెలకొంది.రేవంత్ రెడ్డి అయితేనే టిఆర్ఎస్ ను బలంగా ఢీ కొట్టగలరని కాంగ్రెస్ అధిష్టానం ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు.

Telugu Damodar Reddy, Komati Venkata, Konda Surekha, Rahul Gandi, Revanth Reddy,

కొత్త అధ్యక్షుడి ఎన్నికతో పాటు, జిల్లాల వారీగా భారీ ఎత్తున కమిటీలను నియమించి అందులో అందరికీ ప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.కొత్త కమిటీల్లో అన్ని కులాలు, ప్రాంతాలు, జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి కొండా సురేఖ పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి కి, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, సంభాని చంద్రశేఖర్ తో పాటు మిగిలిన కీలక నాయకులు అందరికీ కొత్త కమిటీల్లో ప్రాధాన్యం ఉన్న పదవులను ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

టిఎస్ పిసిసి కార్యవర్గం తో పాటే , సలహాల కమిటీ,  ఎన్నికల నిర్వహణ కమిటీ, ప్రచార కమిటీ, స్ట్రాటజీ .ప్లానింగ్ కమిటీ, ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీలను నియమించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.కొత్త కమిటీల ప్రకటన రేపో మాపో వెలువడే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube