కాంగ్రెస్ నుంచి నలుగురు ఫైనల్ ? పేర్లు ఇవే ?

హుజురాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని ప్రధాన పార్టీలు మరింత స్పీడ్ పెంచాయి.ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించగా, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేసే అవకాశం ఉంది.

 The Congress Has Selected Four Names As The Congress Candidate To Contest From H-TeluguStop.com

  కాంగ్రెస్ విషయంలోనే క్లారిటీ రాలేదు.  ఇక్కడి నుంచి కొండా సురేఖ ను అభ్యర్థిగా పోటీకి దింపాలని రేవంత్ భావించినా, ఆమె నాన్ లోకల్ అనే ఫీలింగ్ రావడంతోపాటు, పోటీకి విముఖత వ్యక్తం చేయడం, అనేక డిమాండ్లు విధించడం ఇలా అనేక కారణాలతో ఆమె పేరును ఇంకా ఫైనల్ చేయలేదు.

అయితే అకస్మాత్తుగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అక్టోబర్ ఒకటో తేదీన అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.ఈ క్రమంలోనే నలుగురు పేర్లను అభ్యర్థులుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దామోదర రాజ నరసింహ కమిటీ ఎంపిక చేసింది.

కృష్ణారెడ్డి, రవికుమార్ ( మున్నూరు కాపు), సైదులు (ఎస్సీ), ప్యాట రమేష్ ( మున్నూరు కాపు), పేర్లు ఉన్నాయి.ఎల్లుండి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ ఆధ్వర్యంలో జరగబోయే సమావేశంలో  అభ్యర్థిని ఎంపిక చేయబోతున్నారు.

అక్టోబర్ ఒకటో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వడం,  8వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటం 30వ తేదీన ఎన్నికలు జరగబోతూ ఉండడం తో కాంగ్రెస్ అలెర్ట్ అయ్యింది.ఇప్పటివరకు టిఆర్ఎస్,  బిజెపి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉండగా, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రచారం చేద్దాం అన్నట్లుగా కాంగ్రెస్ పెద్దగా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టలేదు.

Telugu Congress, Etela Rajender, Hujurabad, Konda Surekha, Pcc, Revanth Reddy, T

ఇక వరుసగా ఎన్నికల ప్రచారంతో అటు టిఆర్ఎస్ ఇటు బిజెపి ని పెట్టే విధంగా చేయాలని,  ఇప్పటివరకు పార్టీ సీనియర్ నేతలతో ఉన్న విభేదాలను పక్కన పెట్టి,  అందరినీ కలుపుకు వెళ్తూనే హుజురాబాద్ లో గెలిచి తన సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ ఉన్నారు.అయితే ప్రస్తుతం ఎంపిక చేసిన నలుగురు పేర్లతో పాటు,  కొత్తగా మరేదైనా పేరు అక్టోబర్ 1 నాటికి తెరపైకి వస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube