గ్రామాల్లోని విద్యార్థుల అవస్థ.. చెట్ల మీదకి ఆన్లైన్ తరగతులు వింటున్న విద్యార్థులు..!

దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర సంక్షోభాన్ని తీసుకొచ్చింది.కరోనా వల్ల ఆర్థిక నష్టమే కాదు, విద్యా నష్టం కూడా వాటిల్లింది.

 The Condition Of Students In Villages Students Listening To Online Classes On Tr-TeluguStop.com

చాలా మంది విద్యార్థులు ఆన్ లైన్ పాఠాలు వినలేక చనిపోయారు.మరికొందరు స్మార్ట్ ఫోన్లు లేక విద్యకు దూరమయ్యారు.

లాక్ డౌన్ టైంలో విద్యార్థులు పడిన బాధలు అన్నీ ఇన్ని కావు.కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వలన విద్యార్థులు పాఠాలు వినలేక, విద్యకు దూరమై చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది.

తాజాగా మహారాష్ట్రలో కూడా ఇటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.మహారాష్ట్ర లోని కొన్ని గ్రామాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేదు.

నెట్ వర్క్ సరిగా లేకపోవడం వలన విద్యార్హులు అనేక ఇబ్బందులు పడాల్సిన వచ్చింది.ఆన్ లైన్ తరగతులు వినలేక గోండియా జిల్లాలోని కొన్ని గ్రామాలల్లో విద్యార్థుల పరిస్థితి చాలా దీనంగా తయారైంది.

గ్రామంలో ఒకే ఒక మొబైల్ నెట్ వర్క్ ఉంది.ఆ విద్యార్థులు తమ గ్రామానికి దాదాపుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్లాలి.

ఆ తర్వాత చెట్లు ఎక్కి ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవ్వాల్సిన దుస్థితి అనేది నెలకొంది.చెట్టెక్కిన తర్వాత చేతిలో మొబైల్, పెన్నులు పెట్టుకుని చెవులకు హెడ్ ఫోన్లను పెట్టుకుని విద్యార్థులు చెట్లు ఎక్కుతుంటే గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చెట్లే తమకు సరైన ఇంటర్నెట్ ను అందిస్తున్నాయని విద్యార్థులలో కొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు.ఇళ్లలో సరైన సౌకర్యం లేకపోవడం వలన విద్యుత్ సరఫరాలో అంతరాయాలు అనేవి ఉండటం వలన విద్యార్థులు తమ విద్యకు దూరం అవుతున్నారు.

దీనివల్ల పేద విద్యార్థులు సుమారు 18 కిలోమీటర్ల దూరం కూడా నడిచి చదువుకోవాల్సిన పరిస్థితి అనేది నెలకొంది.

Telugu Plm, Classes, Tree, Latest-Latest News - Telugu

15 నెలలుగా సుమారు 150 మంది విద్యార్థులు ఈ విధంగానే చెట్లపై ఎక్కి ఆన్ లైన్ తరగతులు వినాల్సిన పరిస్థితి అనేది నెలకొంది.ఒక్కోసారి రాత్రి సమయంలో 8 లేదా ఎనిమిదిన్నర గంటలు వరకూ కూడా విద్యార్థులు ఇలా తరగతులు వింటూ చీకటిలో టార్చ్ లైట్ల మధ్య తమ స్వస్థలాలకు చేరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube