పూర్వ కాలంలో ఏడు వారాల నగలు ఎందుకు ధరించేవారో తెలుసా?  

The Complete Story Of Seven Week Jewelry-

పూర్వ కాలం నుండి స్త్రీలు నగలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూస్తూనఉన్నాం. స్త్రీలు రకరకాల ఆభరణాలు చేయించుకుంటూ నలుగురికి చూపించఆనందపడటం చేస్తూ ఉండటం సాధారణంగా జరుగుతుంది. అదే పుట్టింటి వారచేయించినవి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు..

పూర్వ కాలంలో ఏడు వారాల నగలు ఎందుకు ధరించేవారో తెలుసా?-The Complete Story Of Seven Week Jewelry

వాటిని చాలా అపురూపంగచూసుకుంటారు.అంతేకాక వంశపారంపర్యంగా వచ్చే ఏడు వారాల నగలను ఇంకా చాలా అపురూపంగచూసుకుంటారు. పూర్వ కాలంలో తమ స్థాయిని చెప్పటానికి ఏడు వారాల నగలనధరించేవారు.

ప్రతి రోజు ధరించకపోయిన పర్వ దినాల్లో మాత్రం తప్పనిసరిగధరించేవారు.ఆదివారం రోజున ‘కెంపులు’… సోమవారం రోజున ‘ముత్యాలు’… మంగళవారం రోజు‘పగడాలు’… బుధవారం రోజున ‘పచ్చలు’… గురువారం రోజున ‘పుష్యరాగాలు’…శుక్రవారం రోజున ‘వజ్రాలు’… శనివారం రోజున ‘నీలాలు’ స్త్రీలు ధరించఆభరణాల్లో వుండాలని మన పెద్దలు నియమం చేసారు.ఇలా ఏడు వారాల నగలను ధరించటం వెనక ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి. క్రమంలో ఏడువారాల నగలు ధరించడం వలన ఆయురారోగ్యాలు పెరుగుతాయనీ … సంతాసౌభాగ్యాలు నిలుస్తాయని స్త్రీల నమ్మకం. అంతేకాక ఆయా గ్రహాల అనుగ్రహకూడా ఉంటుందని విశ్వసిస్తారు.