వేషం మార్చి పోలీస్ స్టేషన్లకు వెళ్లిన కమిషనర్.. అసలు కారణం ఏమిటంటే..!?

తాజాగా ఓ పోలీస్ కమిషనర్ మారువేషం ధరించి పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు ప్రజలకు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారన్న విషయంపై సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించాడు.ఈ సంఘటన తాజాగా మహారాష్ట్రలోని పింప్రి చించ్ వాడ్ నగరంలో జరిగింది.

 The Commissioner Who Went To The Police Stations In Disguise What Is The Real Reason-TeluguStop.com

ఈ నగరం విషయానికి కాస్త క్రైమ్ రేట్ ఎక్కువగానే ఉందని చెప్పాలి.ఈ నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లలో పోలీస్ అధికారులు తమ విధులు ఎలా నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకునేందుకు ఆ నగర కమిషనర్ కృష్ణ ప్రకాష్ ఓ మటన్ దుకాణంలో పని చేసే వ్యక్తి లాగా వేషం వేసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

తెల్ల టోపీ, సల్వార్ ధరించి అచ్చం ఓ ముస్లిం వ్యక్తి లా కనిపించే విధంగా తన లుక్ ను మార్చుకొని నగరంలోని మూడు పోలీసు స్టేషన్లను అతడు సందర్శించాడు.ఇందులో భాగంగా నగరంలోని హింజేవది పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భార్యపై అత్యాచారం చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించాలని ఫిర్యాదు చేశాడు.

 The Commissioner Who Went To The Police Stations In Disguise What Is The Real Reason-వేషం మార్చి పోలీస్ స్టేషన్లకు వెళ్లిన కమిషనర్.. అసలు కారణం ఏమిటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ పోలీస్ స్టేషన్ తర్వాత నగరంలోని ఒక పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ కొందరు దుండగులు తన భార్య ఆభరణాలు ఎత్తుకు వెళ్లారని కంప్లైంట్ ఇచ్చాడు.ఆపై పింప్రీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఓ అంబులెన్స్ డ్రైవర్ గా కంప్లైంట్ అందించాడు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.తనకు రెండు స్టేషన్లో పోలీసులు బాగానే స్పందించారని, కాకపోతే ఓ పోలీస్ స్టేషన్లో కాస్త చేదు అనుభవం ఎదురైంది అని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే ఈ మారువేషం కేవలం సామాన్యుల సమస్యల పై పోలీసులు ఎలా స్పందిస్తున్నారన్న విషయం తెలుసుకునేందుకు మాత్రమే అన్నట్లు తెలియజేశారు.ఈ మారువేషం విషయంలో భాగంగా కమిషనర్ తోపాటు ఆ నగర అసిస్టెంట్ కమిషనర్, అలాగే ఆయన భార్య కూడా పాల్గొన్నారు.

#Officer #Changed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు