రానున్న కాలం కాంగ్రెస్ కు అగ్ని పరీక్ష...అందుకే ఈ వ్యూహమా

తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు బలపడాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండడంతో రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

 The Coming Period Will Be A Test For The Congress Details, Telangana Politics, Revanth Reddy, Congress Party, Telangana Elections, Bjp Party, Trs Party, Senior Congress Leaders, Kcr, Bandi Sanjay-TeluguStop.com

ఇప్పటికే సభ్యత్వ నమోదు పై పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో ఇక తమకంటూ స్వంత మీడియా ఉండేలా కూడా పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.ఎందుకంటే కాంగ్రెస్ ఎంతగా శ్రమించినా కూడా తగినంత ప్రచారం అనేది లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అంతగా ప్రజల్లోకి వెళ్ళలేక పోతోంది.

అందుకే ఇక స్వంత మీడియా ఉండడం ద్వారా చాలా వ్యూహాత్మకంగా ప్రజల్లోకి కాంగ్రెస్ ను తీసుకెళ్లవచ్చు అనేది కాంగ్రెస్ ఆలోచనగా అనిపిస్తోంది.

 The Coming Period Will Be A Test For The Congress Details, Telangana Politics, Revanth Reddy, Congress Party, Telangana Elections, Bjp Party, Trs Party, Senior Congress Leaders, Kcr, Bandi Sanjay-రానున్న కాలం కాంగ్రెస్ కు అగ్ని పరీక్ష#8230;అందుకే ఈ వ్యూహమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ఇక పూర్తి స్థాయి సభ్యత్వ నమోదు అనేది పూర్తి స్థాయిలో పూర్తయిన తరువాత ఇక ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండేలా కార్యాచరణను రూపొందించుకునే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం బీజేపీ పార్టీ కాంగ్రెస్ కు పోటీగా వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తరువాత ప్రత్యామ్నాయ స్థానం కొరకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.మరి స్వంత మీడియా వ్యూహం కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళడానికి ఏ మేరకు దోహదపడుతుందనేది చూడాల్సి ఉంది.

అయితే ఎంతగా ప్రచారంపై దృష్టి పెట్టినా పార్టీ నాయకులందరూ ఏకమై పార్టీ పటిష్టతకు కలిసి పని చేస్తేనే ప్రజల్లోకి చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ అనేది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.లేకపోతే ఎవరి దారి వారిది అనే విధంగా వెళ్తే ఇక నాయకత్వం పరంగా ఎంతగా ప్రయత్నం చేసినా ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు.ఇప్పటికే సీనియర్ నేతల వైఖరిపై రేవంత్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.మరి అధిష్టానం రేవంత్ ఫిర్యాదుపై ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.

The Coming Period Will Be A Test For The Congress Details, Telangana Politics, Revanth Reddy, Congress Party, Telangana Elections, Bjp Party, Trs Party, Senior Congress Leaders, Kcr, Bandi Sanjay - Telugu @revanth_anumula, Bandi Sanjay, Bjp, Congress, Senior Congress, Telangana, Trs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube