దేవుడా.. 53 ఏళ్ల నుండి ముక్కులోనే ఉండిపోయిన నాణెం.. చివరకు..?

మనము చాలా సార్లు చూస్తూ ఉంటాం చిన్న పిల్లలు గొంతులో లేకపోతే ముక్కలోకి నాణెలను వేసుకొని చివరికి ప్రాణం మీదకు తెచ్చుకున్న పరిస్థితులను మనం చూస్తూనే ఉంటాము.అయితే 53 సంవత్సరాల క్రితం పిల్లాడిగా ఉన్న ఓ వ్యక్తి కూడా ఇలానే చేశాడు.

 53 Years Person, Metal Coin, Breathing Problem, Docters, Nose, Metro Coin Remove-TeluguStop.com

ఆ పెద్దాయన చిన్నప్పుడు నోటిలో కాకుండా నాణెం ను ముక్కులో పెట్టుకున్నాడు.అప్పటినుంచి ఆ నాణెం ఆయన ముక్కు లోనే ఉండిపోయింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

రష్యా దేశంలోని జెలెనోగ్రాడ్ ప్రాంతానికి చెందిన ఓ 59 ఏళ్ల వృద్ధుడుకి గత కొన్ని దినాలుగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే అతడికి ఆరు సంవత్సరాలు ఉన్న సమయంలో తన కుడి వైపు ముక్కు రంగంలోకి ఓ చిన్న నాణెంను దూర్చుకున్నాడు.అయితే ఆ విషయం తన తల్లిదండ్రులకు తెలియకుండా దాచి పెట్టాడు.

ఆ విషయం అప్పట్లో ఆయనకు పెద్దగా ఇబ్బంది కలిగించలేదు.దాంతో అతడు దానిని లెక్క చేయకుండా అలాగే వదిలేశాడు.

అసలు అలా జరిగిందన్న విషయం కూడా పూర్తిగా మర్చిపోయాడు అతడు.ఈ మధ్యకాలంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన హాస్పిటల్ లో చేరాడు.

వైద్య పరీక్షల నేపథ్యంలో ఆయనకు డాక్టర్లు పరీక్షలు చేయగా అతడి ముక్కులో ఏదో వస్తువు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.దాంతో అతని ముక్కులో పూర్తిగా కుడి వైపు శ్వాస నాళం రంధ్రాన్ని ఆ నాణ్యం మూసేసింది.

Telugu Person, Problem, Docters, Coin, Nose-Latest News - Telugu

ఆ తర్వాత వైద్యులు అతనికి చేసిన రిపోర్టర్ ల వివరాలను చూపించి ముక్కులో ఉన్న వస్తువును తొలగించాలని అతడికి శస్త్ర చికిత్స నిర్వహించి అతడి ముక్కు లో ఉన్న నాణెంను తొలగించారు.దాదాపు రెండు గంటల సమయం డాక్టర్లు శ్రమించి ఆ పెద్దాయన ముక్కులో ఉన్న దాన్ని బయటికి తీశారు.ఆ నాణెం లోహము నాణెం కావడంతో పూర్తిగా తుప్పు పట్టేసింది.53 సంవత్సరాలు పాటుగా ముక్కులోనే ఉండటంతో అది కాస్త కొద్దిభాగం ముక్కలైంది.సర్జరీ చేసి దాన్ని తొలగించిన తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా డాక్టర్లు అతనికి వైద్య చికిత్స అందించారు.దీంతో ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా ఊపిరి పీల్చుకున్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube