కొంతమంది మత పెద్దలు తమకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతారు.ఎలాంటి సాహసాన్నైనా తాను చేయగలమని, తమ ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదని చెబుతుంటారు.
అంతేకాదు ఆ సాహసాలు కూడా చేసి ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్లు కోకొల్లలు.రాజాగా ఒక చర్చి పాస్టర్ ఇలాగే అనుకుంటూ పాము చేత కాటు వేయించుకున్నాడు కట్ చేస్తే చనిపోయాడు.
వివరాల్లోకి వెళితే, యూఎస్ఎలోని కెంటకీ రాష్ట్రానికి చెందిన జేమీ కూట్స్( Jamie Coots ) అనే పాస్టర్ తన వివాదాస్పద ప్రవర్తనలకు పేరుగాంచాడు.దేవుడు తనకు పాముల కాటు నుంచి రక్షణ ఇచ్చాడని నమ్ముతూ, చర్చి సేవల సమయంలో ప్రత్యక్షంగా పాములను పట్టుకుని చూపించేవాడు.
రెండు దశాబ్దాల పాటు కూట్స్ ఈ ప్రమాదకరమైన ప్రదర్శనలు చేస్తూ, ఎనిమిది సార్లు పాముల కాటుకు గురయ్యాడు.అతనికి ర్యాటిల్‌స్నేక్‌లు, విషపు పాములు అంటే చాలా ఇష్టం.
విషానికి వ్యతిరేకంగా తట్టుకోగల శక్తిని నిరూపించుకోవడానికి, అతను ఒక టీవీ షోలో పాల్గొనడానికి అంగీకరించాడు.కానీ ఈ నిర్ణయం విషాదానికి దారితీసింది.

షో సమయంలో, కూట్స్ చేతిలో ఉన్న ర్యాటిల్‌స్నేక్ పాము( Rattlesnake) అతన్ని కాటు వేసింది.వెంటనే పరిస్థితి విషమించడం మొదలైనా, కూట్స్ వైద్య సహాయం తీసుకోవడానికి నిరాకరించాడు.బదులుగా, ప్రార్థనపై నమ్మకంతో ఇంటికి వెళ్లాడు.చింతిస్తున్న అతని సంఘ సభ్యులు 911కి కాల్ చేశారు.అతనికి ఇష్టం లేకపోయినా, పారామెడిక్స్ అక్కడికి చేరుకున్నారు.అతని పరిస్థితి బాగా దిగజారిందని గమనించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అక్కడ అతను మరణించాడని ప్రకటించారు.ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అయ్యారు.
కొందరు అతని అజాగ్రత్త ప్రవర్తనను విమర్శించారు, “విషపూరిత పామును రెచ్చగొట్టడం వల్ల ఏం జరుగుతుంది?” అని అన్నారు.ఇంకొందరు, “మూర్ఖపు ఆటలు ఆడితే మూర్ఖపు బహుమతులు గెలుచుకోవాలి” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది, అదేంటంటే జేమీ కూట్స్ తన ఇమ్యూనిటీ పవర్‌పై ఉన్న అపారమైన నమ్మకం చివరికి అతని ప్రాణాలనే బలితీసుకుంది.ఈ లింక్ https://youtu.be/dtqyOoS0aTI?si=IdSpgJVnHPSTW57d పై క్లిక్ చేసి పాస్టర్ వీడియోను చూడవచ్చు.