తమ కంపెనీలో పని చేసే వారిని మోకాళ్లపై రోడ్డు మీద నడిపించిన సంస్థ, విమర్శలతో కంపెనీ మూత.. అసలేం జరిగిందంటే

చిన్న పిల్లలు తప్పు చేస్తే తల్లి దండ్రులు శిక్షించకున్నా, స్కూల్‌లో టీచర్స్‌ దండిస్తారు.వారికి ఏదైనా శిక్షను వేస్తారు.

 The China Top Company Punishes Their Workers On The Road-TeluguStop.com

అయితే ఆ శిక్ష కాస్త సులభంగానే ఉంటుంది.స్కూల్‌ లో గోడ కుర్చీ వేయించడం, ముక్కు చెంప కొట్టించడం, మోకాళ్లపై నడిపించడం వంటివి చేస్తారు.

వాటి వల్ల పెద్దగా ఇబ్బంది లేకున్నా వారి పరువు పోయినంత పని అవుతుంది.చిన్న పిల్లలు కనుక పర్వాలేదు.

కాని పెద్ద వారితో ఇలాంటి పనులు చేయిస్తే ఎలా ఉంటుంది.కొన్ని నెలల క్రితం ఒక కంపెనీలో ఉద్యోగస్తులు సరిగా పని చేయడం లేదని, ఆ కంపెనీకే చెందిన ఒక మహిళతో వారిని లైన్‌ గా నిల్చోబెట్టి చెంపదెబ్బలు కొట్టించారు.

ఆ విషయం మరిచి పోక ముందే చైనాలో మరో దారుణం జరిగింది.

ఒక కంపెనీలో ఉద్యోగస్తులు ఇచ్చిన టార్గెట్‌ను చేరుకోలేక పోయారంటూ సంస్థ వారిని రోడ్డుపై నడిపించింది.అది కూడా మోకాళ్లపై నడిపించింది.రోడ్డుపై సంస్థ ఉద్యోగులు నడుస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.

పోలీసులు అడ్డుకున్నారు.రోడ్డుపై సదరు కంపెనీ ఉద్యోగస్తులు మోకాళ్లపై నడుస్తుంటే, అదే కంపెనీకి చెందిన ఒక వ్యక్తి ఆ కంపెనీకి చెందిన జెండాను పట్టుకుని ముందు నడుస్తున్నాడు.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.ఇలాంటి కంపెనీలపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ వినిపిస్తుంది.

మగవారు మాత్రమే కాకుండా ఆడవారు కూడా ఈ మోకాళ్లపై నడిచే శిక్షను అనుభవించారు.ఆడవారు మోకాళ్లపై నడవలేక చాలా ఇబ్బంది పడ్డట్లుగా వీడియోలో చూడవచ్చు.అంత్యంత దారుణమైన ఈ పనిష్మెంట్‌ తో సంస్థపై చైనా ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.ఉద్యోగస్తులు టార్గెట్‌ రీచ్‌ కాకుంటే వారికి జీతం కట్‌ చేయడం, మరేదైనా శిక్ష విధించడం చేయాలి కాని ఇలా రాక్షసంగా రోడ్డుపై మోకాళుపై నడిపించడం ఏంటని అంతా ప్రశ్నిస్తున్నారు.

పోలీసుల రంగ ప్రవేశంతో సంస్థ తాత్కాలికంగా షట్‌ డౌన్‌ అయ్యింది.ప్రస్తుతం సంస్థలో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు.దాంతో ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సంస్థను వెంటనే ఓపెన్‌ చేయించాలని కోరుతున్నారు.తమకు విధించిన శిక్షతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇకపై కష్టపడి పని చేస్తామని వారు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube