చిన్న పిల్లలకు మట్టి తినడం లేదంటే బయటి చెత్త చెదారంను నోట్లో పెట్టుకోవడం వంటివి చేయడం వల్ల నట్టలు పడతాయంటారు.మోషన్ పోయే సమయంలో అందులో పురుగులు వస్తాయి.
ఆ పురుగులు కదులుతూ ఉంటాయి.అప్పట్లో పిల్లలు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడేవారు.
ఇప్పుడు పిల్లలకు ఇలాంటి సమస్యలు రావడం లేదనుకోండి.కాని చైనాకు చెందిన ఒక వ్యక్తికి మాత్రం నట్టలు కాదులే కాని అచ్చు అలాగే ఉండే పురుగులు పడ్డాయి.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 700 లకు పైగా పురుగులు అతడి శరీరంలో ఉన్నట్లుగా వైధ్యులు గుర్తించారు.అతడి రిపోర్ట్‌లు చూసిన వైధ్యులు ఆశ్చర్యపోయారు.బాబోయ్ అనుకుని అతడి బతకడం కష్టమే అన్నట్లుగా చెప్పారట.వైధ్యులను నివ్వెర పర్చిన ఈ సంఘటన చైనాలో జరిగింది.
ఈ సంఘటనపై ప్రపంచ వైధ్య శాస్త్ర శాస్త్రవేత్తలు అంతా ఆసక్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అతడిపై రీసెర్చ్ చేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు.
వందల సంఖ్యలో పురుగులు శరీరంలో ఉన్నా కూడా అతడు బతకడం ఒక మెడికల్ మిరాకిల్ అంటూ వైధ్యులు చెబుతున్నారు.

చైనాకు చెందిన వ్యక్తి తల నొప్పి బాగా లేస్తుందంటూ హాస్పిటల్‌కు వెళ్లగా డాక్టర్లు మెడిసిన్స్ ఇచ్చారు.మెడిసిన్స్‌కు తల నొప్పి తగ్గక పోవడంతో తలను స్కాన్ చేశారు.తలలో పురుగులు ఉన్నట్లుగా గుర్తించారు.
ఆ తర్వాత శరీరం అంతా కూడా స్కాన్ చేసిన వైధ్యులు అతడి శరీరంలో ఏకంగా 700 పురుగులు ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చారు.అతడి శరీరంలో ఉన్న పురుగులను టేప్ వర్మ్స్ అంటారట.
రిబ్బన్ తరహాలో చాలా పొడుగుగా ఉన్నాయట.టైనియాసిస్ అంటూ ఈ వ్యాధిని అంటారట.
ప్రస్తుతం అతడు వైధ్యుల పరిరక్షణలో ఉన్నాడు.అతడికి చికిత్స అందిస్తున్నారు.
మెదడు, ఊపిరి తిత్తులతో పాటు పలు శరీర అవయవాల్లో ఈ పురుగులు ఉన్నట్లుగా వైధ్యులు గుర్తించి వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.