రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందిన సినీ సెలబ్రిటీలు వీళ్ళే?

రోడ్డు ఎక్కితే చాలు ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు.కానీ అదే రోడ్డుపై ప్రమాదం జరిగితే మాత్రం అందనంత దూరానికి పయనమవుతారు.

 The Children Of Celebrities Died In A Road Accident, Road Accident, Celbrities,-TeluguStop.com

ప్రజలు, సెలబ్రేటీలు, రాజకీయ నాయకులు ఇలా ప్రతి ఒక్కరు రోడ్లపై ప్రయాణించాల్సిందే.ఇక కొన్ని కొన్ని సార్లు ఈ ప్రయాణంలో అనుకోకుండా ప్రమాదాలు జరుగుతాయి.

మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళిన అవతలి వాళ్ల ప్రయాణాలవల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.అంతేకాదు అవతలి వాళ్ళు నెమ్మదిగా వచ్చిన మనం చేసే ప్రయాణాలలో కూడా కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.

ఇదిలా ఉంటే కొందరు సినీ సెలబ్రిటీలు కూడా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు.ఇంతకు వాళ్లు ఎవరో తెలుసుకుందాం.

తాజాగా మెగా వారి అల్లుడు, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయమైన సంగతి తెలిసిందే.దీంతో ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

గతంలో 2019లో సినీ నటుడు, రాజకీయ నాయకుడు హరికృష్ణ నల్గొండ జిల్లాలో తాను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో ఆయన మరణించారు.ఇక తన పెద్ద కొడుకు జానకిరామ్ కూడా 2014లో నల్గొండ జిల్లాలోని కారు ప్రమాదంలో మరణించాడు.

ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా 2009లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్ కు వస్తున్న సమయంలో ఆయనకు కూడా నల్గొండ జిల్లాలోని యాక్సిడెంట్ అయింది.దీంతో ఆయన ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు.

Telugu Janaki Ram, Road, Sai Dharam Tej-Movie

ఇక మరో సినీ నటుడు, రాజకీయ నాయకుడు బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ కూడా హైదరాబాదులో తన స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో బైకు అదుపు తప్పడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మరో నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు వెంకట సాయి ప్రసాద్ కూడా స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో అతివేగంతో ప్రమాదానికి గురికావడంతో ఆయన కూడా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.ఇక భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దిన్ కూడా బైక్ ప్రమాదంలో మరణించాడు.ఇలా ఎంతోమంది సెలబ్రెటీల కుటుంబాలు, సెలబ్రెటీలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదులుకోగా.

మరికొందరు గాయాలతో బయటపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube