నెటిజ‌న్ల‌ను ఫిదా చేస్తున్న చిన్నారి.. ఇంత‌కీ ఏం చేసిందంటే..?

మ‌న‌స్ఫూర్తిగా న‌వ్వితే ఎలాంటి రోగాలు రావంటారు పెద్ద‌లు.అయితే ఏ మనిషిని అయినా స‌రే ఆక‌ట్టుకునేది మ‌న న‌వ్వు మాత్ర‌మే.

 The Child Who Is Harassing The Netizens What Has He Done So Far , Child Smile, V-TeluguStop.com

ఆ న‌వ్వు ఉంటే చాలు ఎవ‌రినైనా మ‌నం సంతోష‌పెట్టొచ్చు.ఒక చిన్ని న‌వు ఎన్నో చిరాకుల‌ను, కోపాల‌ను దూరం చేస్తుంది.

ఇక ఎలాంటి కల్మషం లేని చిన్న పిల్ల‌లు న‌వ్వు చూస్తే మ‌న‌కు కూడా ఎంతో సంతోషం వస్తుంది.ఎందుకంటే వారికి ఎలాంటి విష‌యాలు తెలియ‌క‌పోయినా కూడా న‌వ్వు వ‌స్తే నవ్వడం, నొప్పి కలిగితే ఏడవడం చేస్తారు.

అయితే దీన్ని మాత్రం వారు మ‌న‌స్సు నిండా స్వేచ్ఛ‌గా న‌వ్వుతారు.

వీరికి ఆ చిన్న వ‌య‌సులో తెలిసిందే కేవ‌లం ఏది అనిపిస్తే అది చేయ‌డం త‌ప్ప వారికి ఇంకెలాంటి కుళ్లు, కుతంత్రాలు తెలియ‌దు.

ఈ విధంగా వారు ఉంటారు కాబ‌ట్టే చిన్నారుల చిరునవ్వు ఎంత‌మందినైనా ఎలాంటి వారినైనా మాయ చేసి ఆక‌ట్టుకుంటుంది.మ‌నం ఎంత ప‌ని ఒత్తిడిలో ఉన్నా మ‌న ఇంట్లోని పిల్ల‌ల న‌వ్వు చూస్తే మాత్రం ఇట్టే మ‌న చిరాకులు అన్నీ కూడా మ‌ర్చిపోతుంటాం.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఓ చిన్నారికి సంబంధించిన స్మైలీ వీడియోనే నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.అదేంటో తెలుసుకుందాం.

ఇక ఈవీడియోలో ఆ కుటుంబ సభ్యులు తాము తినేందుకు ఎంచ‌క్కా పిజ్జా ఆర్డర్‌ పెట్టుకున్నారు.ఇక పిజ్జా డెలివరీ వ‌చ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తుండ‌గా అక్క‌డే ఉండే ఆ చిన్నారి దాన్ని చూస్తుంది.

ఇంకేముంది అలా బాక్స్‌లో ఉన్న పిజ్జాన చూసి ఎంతో సంతోషిస్తుంది.ఫుల్‌ ఎగ్జైట్‌మెంట్ తో పెద్ద‌గా న‌వ్వుతుంది.

ఇక త‌న రెండు చేతులు పైకెత్తి ఏదో డ్యాన్సు చేస్తున్న‌ట్టు హాయిగా కేరింతలు కొట్ట‌డం కూడా మ‌న‌కు క‌నిపిస్తుంది.ఇక ఇలా ఆ చిన్నారి చేసిన ప‌నిని అక్క‌డే ఉంటున్న కుటుంబ సభ్యులు వీడియో తీయ‌డంతో ఆ న‌వ్వు ఇప్పుడు ల‌క్ష‌లాది మందిని మెస్మ‌రైజ్ చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube