చిన్న పిల్లలు ఏది మాట్లాడినా సరే తిన్నగా అస్సలు అడగరు.దానికి ఇంకేదో జోడించి మాట్లాడుతారు.
వారు ముద్దు ముద్దుగా మాట్లాడే మాటలకు ఎవ్వరైనా సరే ఫిదా కావాల్సిందే.అంతలా వారి మాటలు ఆకట్టుకుంటాయి.
అయితే ఇలా వీరు చేసే అల్లరికి సంబంధించిన వీడియోలో కావచ్చు లేదంటే వారి ముద్దులొలికే మాటలకు సంబంధించిన వీడియోలు కావచ్చు నెట్టింట ఎంతలా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలసిందే.వీరు చేసే పనులు కావాలని చేయరు అయినా సరే అందులో ఏదో ఒక సరదా మాత్రం ఉంటుంది.
కాగా రీసెంట్ గా అలెక్సాతో ఓ చిన్నారి మాట్లాడుతూ తాను కోరినట్టు దమ్ దమ్ డిగ్గా డిగ్గా అని అడగాలంటూ దాన్ని ఆర్డర్ వేసిన వీడియో ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే.ఆ చిన్నారి గుర్తున్నారు కదా.
మరోసారి ఆ చిన్నారి ఆకట్టుకుంటున్నాడు.తన ఆటిట్యూడ్‌తో మరోసారి నెట్టింట స్టార్ అయిపోయాడు.
అతనే కబీర్ సూద్.అప్పుడు అలెక్సాతో అల్లరి చేసిన ఈ చిచ్చర పిడుగు కబీర్ ఇప్పడు ముద్దు మాటలతో ఆకట్టుకుంటున్నాడు.
అయితే ఈ సారి తన తల్లితో కలిసి చేసిన వీడియో వైరల్ అవుతోంది.ఇందులో అతన్ని తల్లి ఆడిస్తూ ఉంటుంది.
అయితే మధ్యలో తల్లి ఆరాధ్య మాట్లాడుతూ రోటీ సబ్జీ కావాలా లేదంటే దాల్ చావల్ కావాలా అంటూ అడుగడం గమనకు కనిపిస్తుంది.అయితే తనకు అవేవీ వద్దని నో అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు కబీర్.అయితే వాటి ప్లేస్‌లో తనకు కేక్ పీస్ కావాలంటూ అడుగుతాడు.కానీ తల్లి ఆరాధ్య మాత్రం మరోసారి రోటీ లేదా దావల్ ఏదో ఒకటి చెప్పు అని అడగ్గా మళ్లీ నో అని తనకు కేవలం కేక్ మాత్రమే కావాలని చెబుతాడు.
ఇలా తన తల్లితో తనకు కేవలం కేక్ మాత్రమే కావాలంటూ డీల్ చేసుకోవడాన్ని అక్కడున్న వారు వీడియో తీయగా అతని పలుకులకు అంతా ఫిదా అవుతున్నారు.
.