బాబు గారు మీరేనా ..అస్సలు ఊహించలేదుగా

The Change In Chandrababus Attitude Is Obvious Compared To The Past

టీడీపీ అధినేత చంద్రబాబు అసలు ఎవరు ఊహించని విధంగా వ్యవహరిస్తున్నారు.గతంలో ఎప్పుడు బాబు వైఖరి ఈ విధంగా కనిపించలేదు.

 The Change In Chandrababus Attitude Is Obvious Compared To The Past-TeluguStop.com

అధికారం ఉన్న లేకపోయినా, పైచేయి తమదే అన్నట్లుగా వ్యవహరించే వారు.పూర్తిగా నాయకులపై నమ్మకం తో వారు చెప్పిన విధంగానే వ్యవహారాలు చేస్తూ ఉండేవాడు .సీనియర్ నాయకులు మాటకు ఎక్కువ విలువ ఇస్తూ,  వారు చెప్పిన విధంగా నడుచుకునే వారు, పదవుల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించేవారు.అయితే ఇప్పుడు దానికి భిన్నంగా చంద్రబాబు వైఖరి కనిపిస్తోంది.

పూర్తిగా బాబు మారిపోయినట్టు గా కనిపిస్తున్నారు.పార్టీ నాయకుల పై ఆధారపడడం మానేసి క్షేత్ర స్థాయిలోనూ ఆయన పర్యటన చేపడుతూ , ఎక్కడా ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్న స్వయంగా హాజరవుతున్నారు.

 The Change In Chandrababus Attitude Is Obvious Compared To The Past-బాబు గారు మీరేనా .. అస్సలు ఊహించలేదుగా-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

        కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో పాటు,  ప్రజల్లోనూ తనలో మార్పు వచ్చిందనే విషయం చర్చ జరిగేలా చేసుకుంటున్నారు.తాజాగా మాచర్ల నియోజకవర్గం కి చెందిన టిడిపి నేత చంద్రయ్య హత్యోదంతంపై సీరియస్ గా స్పందించారు.

చంద్రయ్య పాడెను చంద్రబాబు మోసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు.గతంలో ఎప్పుడు బాబు ఈ విధంగా వ్యవహరించలేదు.

చంద్రయ్య పాడెను మోయడం తో పాటు , ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చి,  25 లక్షల పరిహారం కూడా పార్టీ తరఫున ప్రకటించారు.
   

     గతంలో ఎప్పుడు కార్యకర్తలు వద్దకు ఈ విధంగా వెళ్లి పని చేయని బాబు ఇప్పుడు చిన్న స్థాయి నేతను గుర్తిస్తూ వారికి భరోసా ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.తాను పూర్తిగా మారిపోయానని మారాల్సింది మీరేనని , పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు మీ వంతు ప్రయత్నాలు చేయాలని సంకేతం పంపించేందుకు… టిడిపి అధికారంలోకి వస్తే మీకు మరింత మేలు జరుగుతుందనే సంకేతాలు కేడర్ కు పంపించి వారు ఉత్సాహంగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లే విధంగా చేసేందుకు బాబు ఇప్పుడు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

Video : Chandrababu , TDP, YSR, YSRCP, Jagan,ap Cm, TDP, Macharla, Chandrayya,

#AP Cm #Macharla #Jagan #Ysrcp #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube