కేంద్రం తీరుపై జనాల గుర్రు ! బీజేపీకి గడ్డుకాలమే ? 

గత కొంతకాలంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వివిధ రాష్ట్రాలపై చూపిస్తున్న వివక్ష, దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ధరలు, ఇలా ఎన్నో అంశాలు బీజేపీపై దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని , ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేలా చేశాయి.

 The Central Government Is Facing Populism In Many Respects , Bjp, Central Govern-TeluguStop.com

మోదీకి అప్పట్లో వచ్చిన ఆ క్లీన్ ఇమేజ్ ఆధారంగానే బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో , గుజరాత్ స్థాయిలో దేశాన్ని ముందుకు తీసుకువెళతారని అంతా అభిప్రాయపడ్డారు.మొదటి విడత మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం బాగానే పని చేసినట్లుగా ప్రజల్లో అభిప్రాయం కలిగించడం , అదే సమయంలో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బాగా బలహీనం కావడంతో , రెండోసారి బీజేపీకి అధికారం దక్కింది.

కానీ, బీజేపీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని,  ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికి సంతృప్తిని కలిగించకపోగా , తీవ్ర అసంతృప్తిని రాజేస్తున్నాయి.

  లాభాల్లో ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల్లో ఉన్న ట్లు చూపించి , ప్రైవేటీకరణ చేస్తుండడంఅంబానీ ఆదాని వంటి వారికి మేలు చేసే విధంగా మోడీ ప్రభుత్వం పని చేస్తుందనే అభిప్రాయం జనంలో బాగా పెరిగిపోవడం,  పెట్రోల్,  డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం, దీనికితోడు నిత్యావసరాలు , ఎరువుల ధరలు పెరుగుదల, ఇలా ఎన్నో అంశాలు నడ్డివిరిచే విధంగా ఉన్నాయి.ఇక ఈ విషయంలో కేంద్రం చేతులెత్తేసినట్టు గా వ్యవహరిస్తున్న తీరు, ఇలా ఎన్నో ఎన్నెన్నో అంశాలు  దేశ ప్రజలు బీజేపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతోంది.

Telugu Adani, Ambani, Bad Days Bjp, Central, Corona, Covid, Diesel, Gujarat, Ind

  ఈ వ్యతిరేకత గమనించే బీజేపీ మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా బీజేపీకి దూరం అవుతున్నాయి .ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపించలేకపోయింది.అలాగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి అనే సర్వేలు బయటకు వచ్చాయి.మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా బీజేపీ కి రాబోయేది గడ్డుకాలమే అనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.

దీనికి కారణం ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే అనేది స్పష్టంగా అర్థం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube