కోవిడ్ నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వైరస్ వ్యాప్తి దారుణాతి దారుణంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా మహరాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భయాన్ని పుట్టిస్తున్నాయి.

 The Central Election Commission Has Taken A Key Decision In The Wake Of Covid-TeluguStop.com

ఇంతటి సంక్లిష్ట పరిస్దితుల్లో కూడా రాజకీయ నేతలు ఎన్నికలకు సిద్దం అయ్యి వీటిని నిర్వహిస్తున్నారు.

కాగా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న శాసనసభ ఎన్నికలు మరో మూడు దశలు మిగిలి ఉన్నాయి.

 The Central Election Commission Has Taken A Key Decision In The Wake Of Covid-కోవిడ్ నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.రాజకీయ పార్టీలు ఏవీ రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 10 మధ్య ర్యాలీలు, సమావేశాలు నిర్వహించొద్దని ఆదేశించింది.

అలాగే, ప్రచారంలో పాల్గొనే వారి రక్షణ కోసం ఆయా పార్టీలే మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, ర్యాలీలు, సమావేశాల్లో భౌతిక దూరం తప్పనిసరని స్పష్టం చేసింది.

ఇక ఆయా జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండి కోవిడ్ నియమాలను పర్యవేక్షించాలని ఆదేశాల్లో పేర్కొంది.

ఇకపోతే ఈ సైలెన్స్ పిరియడ్‌ను 48 గంటల నుంచి 72 గంటలకు పొడిగిస్తున్నట్టు స్పష్టం చేస్తూ, ఈ నిబంధనలు తక్షణమే అమలు చేయాలని పేర్కొంది.

#Delhi #COvid #West Bengal #Maharashtra #CentralElection

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు