ఇకపై చిన్న కార్లలో సైతం వాటిని తప్పనిసరి చేసిన కేంద్రం..!

అప్పట్లో ఎవరయినా కారు కొంటె గొప్ప విషయంగా చెప్పుకునేవారు.కానీ ప్రస్తుత కాలంలో మాత్రం మధ్య తరగతి ప్రజలు కూడా కారు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

 The Center That Made Them Mandatory Even In Small Cars Anymore  Small Cars, Late-TeluguStop.com

కొత్తకారు కొనడానికి ఆర్ధిక స్తోమత లేనివాళ్లు సెకండ్ హ్యాండ్ కారు అయినాసరే కోనే ఆలోచన చేస్తున్నారు.కారు కొనుకోవడం మంచి విషయం.

కానీ కారును డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.లేదంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి.

ఈ కాలంలో కార్ల వల్ల ప్రమాదాలు కూడా అధికం అయిపోయాయి.సాధరణ కార్లలో లగ్జరీ కార్ల మాదిరిగా ఎయిర్ బ్యాగ్స్ ఉండవు.

ఫలితంగా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

లగ్జరీ కార్లలో అయితే 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.

కానీ చిన్న కార్లలో ఎటువంటి ఎయిర్ బ్యాగ్స్ ఉండవు.అలా చిన్న కార్లను పేదలు, మధ్య తరగతి ప్రజలు మాత్రమే కొంటారు కాబట్టి రోడ్డు ప్రమాదాలలో వారి ప్రాణాలే ఎక్కువగా పోతున్నాయి.

కాబట్టి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత.ఈ క్రమంలోనే ఇకమీదట చిన్న కార్లలో సైత కనీసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండేలాగా కార్ల కంపెనీలు చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు,రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీ చేసారు.

పెద్దపెద్ద కార్లలో లగ్జరీ కార్లలో మాత్రమే ఎయిర్ బ్యాగ్స్ ను ఆటోమొబైల్స్‌ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయి.మరి ఎంట్రీ లెవల్ కార్లలో ఎందుకు ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేయడం లేదు అనే ప్రశ్నకు జవాబు లేదు.

Telugu Central, Latest, Small Cars-Latest News - Telugu

అందుకే ఇకమీదట కార్లను తయారు చేసే ప్రతి కంపెనీ కూడా తప్పకుండా అన్ని మోడళ్ల వాహనాలలో ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేయాలని తద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని నితిన్ గడ్కరీ అన్నారు.అయితే కేంద్ర మంత్రి చెప్పిన విషయం మంచిదే అయినా ఇలా ప్రతి కారులో ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేయడం అంటే ఆటోమొబైల్ కంపెనీలకు పెద్ద సమస్యగా మారుతుంది.ఎందుకంటే ఇప్పటికే కార్ల మీద ఎక్కువ ట్యాక్స్ ఉంది.మళ్ళీ ఇప్పుడు ఈ ఫీచర్లను కార్లలో ఏర్పాటు చేయాలంటే కార్ల ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube