వాహనాల రిజిస్ట్రేషన్‌‌ను రెన్యూవల్ ధరను పెంచిన కేంద్రం.. వాటికి మాత్రమే.. !

కేంద్రం ఇస్తున్న షాకులకు ప్రజలు గిలగిలలాడుతున్నారట.ఇప్పటికే వాహనాల విషయంలో ఎన్నో కఠినమైన ఆంక్షలు విధిస్తుండగా, ట్రాఫిక్ రూల్స్ కూడా కాస్త కఠినంగా మార్చింది.

 The Center That Increased The Renewal Price Of Vehicle Registration Draft Notifi-TeluguStop.com

ఇదే సమయంలో పాత వాహనాల విషయంలోను కొత్త రూల్స్ తీసుకువచ్చింది.అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.15 సంవత్సరాలు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్‌‌ను రెన్యూవల్ ధరను పెంచుతూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

పాత వాహనాల వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది.ఇకపోతే 15 ఏళ్లు పై బడిన టూ వీలర్ రెన్యూవల్ ధర రూ.1,000 గా, త్రీ వీలర్లకు రూ.3,500, లైట్ మోటార్ వెహికిల్స్ కు రూ.7,500, మీడియం గూడ్స్ ప్యాసింజర్ వెహికిల్స్ కు రూ.10 వేలు, వీ గూడ్స్ లేదా లార్జ్ ప్యాసింజర్ మోటార్ వెహికిల్స్‌కు రూ.12,500గా ఛార్జీలు నిర్ణయించింది.

అయితే ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి పెరిగిన రెన్యూవల్ ధర అమల్లోకి వస్తుందట.దీన్ని బట్టి చూస్తే సెకండ్ హ్యండ్ వాహనాల వ్యాపారం పూర్తిగా మాయం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎందుకంటే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో పాత వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్, ఫిట్‌‌నెస్ సర్టిఫికేట్లు ఆర్థికంగా భారంగా మారనున్నాయి కాబట్టి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube