విద్యుత్ కొరత విషయంలో ఆ రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..!!

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విద్యుత్ కొరత సమస్య ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి కరోనా వైరస్ కారణంగా.

 The Center Has Given Key Directions To Those States In Case Of Power Shortage ,-TeluguStop.com

మొన్నటివరకు బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీలు మూతపడ్డాయి.  మహమ్మారి ప్రభావం ఇటీవల తగ్గడంతో బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీలు ఓపెన్ అయిన సమయంలో.

ఏర్పడిన నష్టాలను భర్తీ చేయడానికి.ఆయా కంపెనీలు బొగ్గు ధరలను పెంచడం జరిగింది.

దీంతో ఇప్పటికే చైనా, లెబనాన్ వంటి దేశాలు చీకటిలోకి వెళ్లిపోయాయి.భారత్ లో కూడా ఇప్పుడిప్పుడే విద్యుత్ సమస్య పెరిగి పోయింది.

ప్రధానంగా బొగ్గు కొరత ఏర్పడటంతో.దేశంలో చాలా రాష్ట్రాలు.విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాయి.ఈ క్రమంలో ఈ సమస్యను అధిగమించడానికి.

కేంద్ర మంత్రులు అమిత్ షా.తో పాటు ప్రధాన మంత్రి మోడీ..ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులతో బొగ్గు శాఖ మంత్రులతో… సమావేశం కావడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాలకు లేఖలు రాయడం జరిగింది.

ప్రజల అవసరాల కోసం కేంద్రం దగ్గర ఉన్న కేటాయించిన విద్యుత్తును.

వాడుకోవాలని పేర్కొంది.విద్యుత్ కొరత లేకుండా.

మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు కరెంటు సాయం అందజేయాలని కోరింది.బొగ్గు నిల్వలు కలిగిన గనులు.

విద్యుత్ కొరత ఎక్కువగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు.బొగ్గు సరఫరా చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.

ఈ క్రమంలో భూపాల్ పల్లి బొగ్గు గనులలో దాదాపు పదిహేను రోజులకు సరిపడా నిల్వలు ఉండటంతో కేంద్రం ప్రత్యేకమైన దృష్టి సారించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube