న‌లుగురు చిన్నారుల ప్రాణం తీసిన కారు సరదా.. !

ఒక చిన్న నిర్లక్ష్యం అతి పెద్ద ప్రమాదంగా మారి ప్రాణాలు తీస్తుందని పలుసార్లు నిరూపించబడింది.అందులో కరోనా వల్ల రాలిపోతున్న ప్రాణాలతో పాటుగా, నిర్లక్ష్యం వల్ల కూడా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.

 The Car That Took The Lives Of Four Children In Uttarpradesh-TeluguStop.com

ఇక ప్రస్తుతం ఎవరి ప్రాణాలకు గ్యారంటీ లేదు.ఇక చిన్నపిల్లలను అయితే కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత పెద్దల పై ఉంది.

ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా కంటికి కనిపించకుండా మృత్యువు గద్దలా తన్నుకుపోతుంది.ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సింగౌలిత‌గా గ్రామంలో చోటు చేసుకుంది.

 The Car That Took The Lives Of Four Children In Uttarpradesh-న‌లుగురు చిన్నారుల ప్రాణం తీసిన కారు సరదా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ ఇంటి ముందు పార్కు చేసిన కారులోకి ఎక్కి సరదాగా ఆడుకుంటున్న ఐదుగురు పిల్ల‌లు వారి లోకంలో మునిగి ఉండగా అనుకోకుండా కారు డోర్స్ అన్ని లాక్ అయిపోయాయట.దీంతో వారంతా అందులోనే ఉండ‌డంతో ఊపిరాడ‌లేదు.

అయితే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు వారిని గుర్తించి బ‌య‌ట‌కు తీసే స‌మ‌యానికే న‌లుగురు చిన్నారులు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిపోయాయట.ఇక ఈ ప్రమాద ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేయగా వారు ఊపిరాడ‌క మృతి చెందిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని వెల్లడించారు.

#No Respiration #Car Door Lock #Car Doors Locke #Child Die #Singaulitanga

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు