ట‌న్నెల్‌లో బీభ‌త్సం సృష్టించిన కారు..

The Car That Caused The Disturbance In The Tunnel

రోడ్డు ప్ర‌మాదాలు ఎంత డేంజ‌ర్ అనేది మ‌నంద‌రికీ తెలిసిందే.ఏ కొంచెం యాక్సిడెంట్ లో అయినా స‌రే ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘ‌ట‌న‌లు మ‌నం అనేకం చూస్తున్నాం.

 The Car That Caused The Disturbance In The Tunnel-TeluguStop.com

డ‌బ్బులు పోతే సంపాదించుకోగ‌లం గానీ ప్రాణాలు పోతే సంపాదించుకోలేం అనే విష‌యాన్ని ఎవ‌రూ సీరియస్ గా తీసుకోవ‌ట్లేదు.ఏదో కొంపలు మునిగిపోతున్న‌ట్టు అత్యంత వేగంగా వెహిక‌ల్స్‌ను డ్రైవ్ చేసి చివ‌ర‌కు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

అయితే ఇప్పుడు కూడా ఇలాంటి ప్ర‌మాదానికి సంబంధించిన వీడియోనే నెట్టింట్లో తెగ చెక్క‌ర్లు కొడుతోంది.

 The Car That Caused The Disturbance In The Tunnel-ట‌న్నెల్‌లో బీభ‌త్సం సృష్టించిన కారు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇది బ‌హిరంగ రోడ్డుమీద జ‌రిగింది కాదండోయ్‌.

ట‌న్నెల్ లో జ‌రిగిన యాక్సిడెంట్ ఇది.ట‌న్నెల్ లో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు అత్యంత జాగ్ర‌త్త‌గా న‌డ‌పాలి.ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేసినా చివ‌ర‌కు ప్ర‌మాదానికి గురి కాక త‌ప్ప‌దు.అయితే ఇప్పుడు హిమాచ‌ల్‌ప్రదేశ్‌కు చెందిన‌టువంటి అట‌ల్ ట‌న్నెల్ ఎంత ఫేమ‌సో అంద‌రికీ తెలిసిందే.మామూలుగానే ఈ రాష్ట్రంలో కొండ‌లు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి ఇలాంటి భారీ టన్నెల్ ల‌ను ఏర్పాటు చేశారు.ఇక అట‌ల్ ట‌న్నెల్ లో ఓ కారు బీభ‌త్సం సృష్టించింది.

అత్యంత వేగంగా వ‌స్తూ ముందు కారును ఛేదించాల‌నే తాప‌త్ర‌యంలో అదుపు తప్పింది.

దీంతో ముందున్న కారును అత్యంత వేగంగా దాటే క్ర‌మంలో ఎడ‌మ వైపు ఉన్న గోడను ఢీకొట్టింది.అక్క‌డితో ఆగ‌కుండా అదే స్పీడుతో అటు ఇటూ తిరుగుతూ మ‌ళ్లీ ఎడ‌మ వైపు ఉన్న గోడ‌ను ఢీకొట్టి ఆ త‌ర్వాత మ‌ళ్లీ కుడివైపుకు వెళ్లి అక్కడే ఆగిపోయింది.కాగా ఈ కారులో ప్ర‌యాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది.

ఎలాంటి ప్రాణ‌న‌ష్టం అయితే జ‌ర‌గ‌లేదు.ఇక ఈ యాక్సిడెంట్‌ను ముందు కారులో ఉన్న వారు వీడియో తీయ‌గా అది కాస్తా నెట్టింట్లో చెక్క‌ర్లు కొడుతోంది.

దీన్ని చూసిన వారంతా కూడా ఇలాంటి ప‌నులు అవ‌స‌ర‌మా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

#Car Speed #Tunnel #Control #Tunnel #Car Tunnel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube