తెలంగాణ బీజేపీ భారం ఇక కేంద్ర మంత్రులదే !?

ఏదో రకంగా తెలంగాణలో అధికారంలో సాధించడమే లక్ష్యంగా బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.పూర్తిస్థాయిలో బీజేపీ అగ్ర నేతలు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించడంతో,  గత కొద్ది నెలలుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

 The Burden Of Telangana Bjp Is On The Central Ministers! Telangana Bjp, Telangan-TeluguStop.com

దేశవ్యాప్తంగా బిజెపికి మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీల సంఖ్య తగ్గిపోవడం,  ఒక్కో రాష్ట్రంలో బలహీనం అవుతూ వస్తూ ఉండడంతో , దక్షిణాది రాష్ట్రాల లో పట్టు సాధించడమే లక్ష్యంగా బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.దీనిలో భాగంగానే తెలంగాణపై బిజెపి అగ్ర నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఈ మేరకు కేంద్ర మంత్రులు,  వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ బిజెపి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కావడంతో పాటు,  రాష్ట్రంలో పర్యటనలు చేపడుతున్నారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

        త్వరలో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో  , కెసిఆర్ ను బిజెపి అగ్ర నేతలు టార్గెట్ చేసుకున్నారు .దీంతో పాటు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండడంతో,  ప్రత్యేకంగా దృష్టి సారించారు.గత జులైలో హైదరాబాద్ కేంద్రంగా బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగగా,  ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ , అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రచారం చేశారు.

కేంద్ర అమలు చేస్తున్న పథకాలను టిఆర్ఎస్ ప్రభుత్వం తమవిగా  చెప్పుకుంటోందనే విమర్శలు చేశారు.ఇక కేంద్ర హోం మంత్రి

అమిత్ షా

సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణలో పర్యటించేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

ఆయన నాలుగు నెలలోనే మూడుసార్లు తెలంగాణలో పర్యటించారు.అలాగే 18 మంది కేంద్ర మంత్రులు వివిధ కార్యక్రమాలను నిమిత్తం హాజరయ్యారు.

దీంతో పాటు,  పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో తెలంగాణలో విస్తృతంగా పర్యటనలు చేపడుతూ తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బిజెపికి ఆదరణ పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
     

Telugu Bandi Sanjay, Bjpcentral, Telangana, Telangana Bjp, Trs-Politics

  త్వరలోనే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగబోతుండడంతో,  ఇక కేంద్ర మంత్రులు పర్యటనలు ఖరారు అయ్యాయి.విస్తృతంగా ఈ నియోజకవర్గంలో పర్యటనలు చేపట్టి మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విజయాన్ని సాధించి పెట్టాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రులు,  బిజెపి అగ్ర నేతలు ఉన్నారు .ఇక తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసే బాధ్యతలు కేంద్ర మంత్రులకు అప్పగించడంతో,   ఢిల్లీ టు తెలంగాణ పర్యటనలు చేపడుతూ టిఆర్ఎస్ పై విమర్శలు చేపట్టే పనుల్లో కేంద్ర మంత్రులు ఉన్నారు.ఇక మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పూర్తిస్థాయిలో ఇక్కడే మఖాం వేసే విధంగా మంత్రులు తమ షెడ్యూల్ రూపొందించుకుంటున్నారు.దీంతో తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసే బాధ్యతలను కేంద్ర మంత్రులకు బిజెపి అధినేతలకు అప్పగించినట్లుగా అర్థమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube