వైరల్ వీడియో: వారిపై అమానుషంగా దాడి చేసిన ఎద్దు..!

ఎద్దులు, బర్రెలు ఎప్పుడెలా ప్రవర్తిస్తాయో ఎవరూ ఊహించలేరు.ఒక్కోసారి ఇవి ఘోరంగా మనుషులను కుమ్మేస్తాయి.

 The Bull That Brutally Attacked Them , Viral Latest , Viral News , Social Media-TeluguStop.com

అయితే తాజాగా జరిగిన ఒక సంఘటనలో అంతకు మించి అనేలా ఒక ఎద్దు సైకిల్ రైడర్ పై భయంకరమైన దాడికి పాల్పడింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే… ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో సైకిల్ రేస్ జరుగుతోంది.ఈ రేస్ లో పాల్గొన్న ముగ్గురు రైడర్లలో ఒకరిపై ఒక ఎద్దు దారుణంగా దాడి చేసింది.

ఈ దాడిలో ఆ రైడర్ చాలా ఎత్తుకు ఎగిరి కింద పడ్డాడు.అంతటితో ఆగకుండా ఈ ఎద్దు అతడిపై మరొకసారి దాడి చేయడానికి ప్రయత్నించింది.

అయితే అతడు వెంటనే అప్రమత్తమై ఆ ఎద్దు నుంచి తప్పించుకొని పరుగుతీశాడు.ఇది ఇతరులపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది.

దీంతో వాళ్లు వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నారు.దీనికి సంబంధించిన వీడియోని ది రాక్ కోబ్లర్ అనే ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

దీనికి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి.

దీన్ని చూసిన నెటిజన్లు ఎద్దుకి సమీపంగా వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.బ్లాక్ బుల్ గివ్స్ యు వింగ్స్ అని కొంతమంది ఫన్నీ గా కామెంట్లు పెడుతున్నారు.అయితే సైకిల్ రైడర్ అనవసరంగా దానికి చాలా సమీపంగా వెళ్లాడని, అది అతడి తప్పేనని నెటిజనులు తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.

మరికొంతమంది మాత్రం తెగ నవ్వుకుంటున్నారు.ఏది ఏమైనా అదృష్టంకొద్దీ ఆ రైడర్ స్వల్ప గాయాలతో ఎద్దు దాడి నుంచి బయట పడ్డాడు.గతంలో కూడా ఆవుల దాడులకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై అందర్నీ షాక్ కు గురిచేశాయి.అయితే ఇప్పుడు అమెరికాలో కూడా ఎద్దు దాడులు జరుగుతున్నాయని తాజాగా నెట్టింట ప్రత్యక్షమైన వీడియోతో తెలిసొచ్చింది.

ఈ లేటెస్ట్ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube