ఇదేందయ్యా ఇది: తెల్ల దూడకు జన్మనిచ్చిన గేదె…!  

buffalo, birth, white calf, mother, viral photo,docters - Telugu Birth, Buffalo, Docters, Mother, Viral Photo, White Cow

కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రపంచంలో రోజుకు ఒక  విధమైన వింత సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము.ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగిన ఇట్టే నిమిషాలలో సోషల్ మీడియా కారణంగా అందరికీ తెలిసిపోతుంది.

TeluguStop.com - The Buffalo That Gave Birth To The White Calf

ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది జంతువులకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు.అందులోచాలా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

అసలు విషయంలోకి వెళితే…

TeluguStop.com - ఇదేందయ్యా ఇది: తెల్ల దూడకు జన్మనిచ్చిన గేదె…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదివరకు మనకు రెండు తలలతో బిడ్డలు పుట్టడం, వినాయకుడు లాంటి ఆకారంలో శిశువులు పుట్టడం ఇలా రకరకాలుగా జన్మించిన వారి వివరాలను సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.ఇకపోతే తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.అవును, జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దేవికొండలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.అదేమిటంటే… ఓ గేదె కు తెల్ల దూడ జన్మించడం.అవును.మీరు విన్నది నిజమే.

కిషన్ అనే రైతుకు చెందిన గేదె ఓ తెల్ల దూడకు తాజాగా జన్మనిచ్చింది.గేద జన్మనివ్వడం అనేది సహజ పక్రియ.

అయితే గేదె ఓ తెల్ల దూడకు ఇలా జన్మించడంతో ఆ ఊర్లో ని గ్రామస్తులంతా ఆశ్చర్యపోతున్నారు.మామూలుగా గేదెలకు తెల్ల దూడ పుట్టడం ఇప్పుడే వింటున్నామని గ్రామస్తులు తెలియజేశారు.

ఇందుకు సంబంధించి పశు వైద్య అధికారులు పరిశీలించగా కేవలం జన్యు లోపం వల్లే ఇలా తెల్ల దూడ పుట్టిందని వారు తెలియజేశారు.వేల సంఖ్యలో ఏదో ఒక గేదెకు ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందని వైద్యాధికారులు తేల్చేశారు.

అయితే దూడ జన్మించిన తర్వాత తన తల్లి దగ్గర పాలు తాగుతున్న సమయంలో తీసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటోలను చూసేయండి.

#Docters #Buffalo #White Cow #Birth #Mother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

The Buffalo That Gave Birth To The White Calf Related Telugu News,Photos/Pics,Images..